Latest
Home » The Party » Ideology

Ideology

కాంగ్రెస్ స్వేచ్ఛ, సహనం, సమానత్వం, మరియు వ్యక్తిగత హక్కుల విలువలు మద్దతిచ్చే జాతీయవాద రూపంగా అనుసరించే ఒక పౌర జాతీయవాద పార్టీ.

జాతీయవాదం:

ఆధునిక రాజ్యాలన్నీ జాతి రాజ్యాలే.’ఒకే జాతి,ఒకే రాజ్యం ‘ అనే భావన మొదటి ప్రపంచ యుద్దానికి దారి తీసింది.జాతీయతా భావాలున్న ప్రజల ప్రగాఢమైన ఆకాంక్షే జాతి.జాతిని ఆంగ్లం లో నేషన్ అంటారు.’నేషన్’ అనే పదం ‘నేషియో’ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ‘నేషియో’ అంటే పుట్టుక అని అర్ధం.
ఒకే తెగ, ఒకే సంస్కృతి, ఒకే సంప్రదాయాలు,ఉమ్మడి కట్టుబాట్లు ఉండే ప్రజల మధ్య ‘మేమంతా ఒక్కటే’ అనే భావన కనిపిస్తుంది.దీన్నే ‘జాతీయత’ అంటారు.
జాతీయత భావం దేశ ప్రజల్లో ఐక్యమత్యాన్ని పెంచుతుంది.

లౌకికవాదం:

లౌకికవాదం అంటే మత విరుద్ధ వ్యవహారం కాదు. రాజకీయాల నుంచి మతాన్ని వేరుచేసి, అన్ని మతాలను సమానంగా గౌరవించి, సమాన అవకాశాలను కల్పించడమే లౌకికవాదం. మత ప్రోక్త రాజ్యవ్యవస్థలో వలే కాకుండా లౌకిక రాజ్యవ్యవస్థ ఏ నిర్దిష్ట మతంతో ముడివడి వుండదు. ప్రభుత్వ విధానాలను మతం ప్రభావితం చేయలేదు. ఏ మతంతోనూ ప్రమేయం పెట్టుకోకుండా రాజ్య వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించడమే లౌకికవాద రాజ్య వ్యవస్థ ప్రధాన లక్షణం.

సామాజిక న్యాయం:

సాధారణంగా సామాజిక న్యాయం అనేది, మానవ హక్కులను అర్థం చేసుకుని మరియు వాటికి విలువను ఇచ్చి, ప్రతి మనిషి యొక్క గౌరవాన్ని గుర్తించి, సమానత్వం మరియు ఐకమత్యం అనే సూత్రాల ఆధారంగా ఒక సాంఘిక సమానత్వ సమాజం లేదా సంస్థను స్థాపించాలనే భావన.

ప్రజాస్వామ్యం:

ప్రజాస్వామ్యం అనేది ఒక రాజకీయ భావన లేదా ప్రభుత్వ ఏర్పాటు విధానం. ఇందులో ప్రజలు నిర్ణయాధికారాన్ని కలిగివుంటారు. ఆంగ్లంలో Democracy అని అంటారు. గ్రీకు బాషా పదము డిమోక్రటియా నుండి ఉద్బవించింది. dēmos అనగా ప్రజలు, kratos అనగా బలము పరిపాలన అని అర్థము.
ప్రజాస్వామ్యం నకు, ప్రతి ఒక్కరికి ఆమోదయొగ్యమైన (నిర్దిష్టమైన) నిర్వచనం అంటూ ఏది లేదు. కాని రాజనీతి శాస్త్రం వివరణ ప్రకారం ప్రజాస్వామ్యం రెండు ప్రధాన నియమాలను అనుసరిస్తుంది.

సమాజం లోని ప్రతి ఒక్కరు సమానం
అందరు స్వతంత్రాన్ని అనుభవించుట
అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఈ క్రింది విదముగా నిర్వచించారు.
ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు.