Latest
Home » Our Leaders » Sripada Rao

Sripada Rao

అడవి తల్లి ఒడిలో పుట్టి ప్రజల కోసం రాజకీయాల్లోకి అడుగిడిన శ్రీపాదరావు, ప్రజల అభివృద్ది కోసం అహర్నిశలు శ్రమించి, ఆ తల్లి ఒడిలోనే తుది శ్వాస వదిలిన దిరోధతుడు,మంథని ప్రజల ఆత్మ బంధువు ,ప్రజా హృదయనేత ,అజాత శత్రువు ……

జననం :

1935వ సంవత్సరంలో మార్చి 2న నాగపూర్ లో కాటారం మండలం ధన్వాడ గ్రామానికిచెందిన ‘మౌళి పటేల్ రాధాకిస్టయ్య, కమలబాయ్’ దంపతులకు జన్మించాడు.

ప్రాధమిక విధ్యాబ్యాసం :

తండ్రి గారి స్వగ్రామం అయిన “ధన్వాడ” గ్రామంలో ప్రాధమికవిద్య పూర్తి చేసుకొని మాధ్యమిక, ఉన్నతవిద్య కొరకు మంథని ప్రయాణమయ్యాడు .

మాధ్యమిక మరియు ఉన్నత విద్య :

మంథనిలోని తన బావగారు అయిన సువర్ణ చంటయ్య ఇంట్లో ఉండి మాధ్యమిక విధ్యాబ్యాసం పూర్తి చేసారు . నాటి నుండి మంథని అని పేరు గడించిన మంత్రపురి చదువులకు నిలయమని అందరికి తెలిసిన విషయమే. ధన్వాడ గ్రామానికి చెందిన శ్రీపాదరావు మంథనిలోని విద్యావంతుల దగ్గర ఎన్నో మెలుకువలు నేర్చుకొని మెట్రిక్యులేషన్ మొదటి స్థానంలో పూర్తిచేశారు.

ఉన్నత విధ్యాబ్యాసం :

మంథనిలో మొదటి స్థానంలో మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన శ్రీపాదరావు హైదరాబాద్ నగరంకు వెళ్లి తన ఇంటర్ మరియు డిగ్రీ విధ్యాబ్యాసం పూర్తి చేసారు .

ఉద్యోగం :

హైదరాబాద్ మహా నగరం లో విద్యనభ్యసించిన శ్రీపాదరావు ఉద్యోగ అన్వేషణ లో బాగంగా ఆదిలాబాద్ జిల్లాలో “పంచాయతి ఇన్స్పెక్టర్”గా కొన్నిరోజులు చేశారు. ప్రజల మద్య పనిచేసిన శ్రీపాదరావుకు, ప్రజల తరపున న్యాయం కోసం పనిచేయాలనే తపనతో నాగపూర్ లోని ప్రజలకు న్యాయ వాదిగా సేవ చేయాలని నిశ్చయించుకున్నడు.గమ్యం చేరుకొనే భాగంగా శ్రీపాదరావు ఎల్ ఎల్ బి పూర్తి చేసి ప్రాక్టీసు మొదలు పెట్టారు.

రాజకీయ ప్రస్థానం :

శ్రీపాదరావు న్యాయవాదిగా సేవలందిస్తున్న తరుణంలో,తండ్రి హటాత్ మరణంతొ సొంత ఊరికి వచ్చిన శ్రీపాదరావు వ్యవసాయమే వృత్తి గా చేసుకొని, గ్రామం లోనేఉన్నారు.వ్యవసాయం తో పాటు LIC ఏజంటు గా పనిచేస్తున్న శ్రీపాదరావు కు తండ్రి గారి సన్నిహితుల వలన చాలా మంది పరిచయాలుగా మారాయి . రాజకీయ నాయకులతో సాన్నిహిత్యం పెరిగింది.అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం ఊపందుకోవడంతో విద్యా వేత్త ,సౌమ్యుడు,స్నేహ శీలిగా పేరుపొందిన శ్రీపాదరావును ప్రజలు గ్రామం నుండి సర్పంచ్ గా పోటి చేయాలని ఒత్తిడిచేశారు. నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్న శ్రీపాదరావు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని స్నేహితులు, సన్నిహితులు ప్రోత్సహించారు. ప్రజల అండ దండలతో ఎన్నికల దిశగా అడుగులు వేస్తూ సర్పంచ్ అభ్యర్థిగా పోటి చేసి మొదటి సారి సర్పంచ్ గా ఎన్నుకో బడ్డారు. శ్రీపాదరావు ప్రజా సేవకు దాసోహం అయిన ధన్వాడ ప్రజలు మరో మారు ఆయనకే సర్పంచ్ పదవిని కట్టబెట్టారు.

రాజకీయ ఎదుగుదలలో తొలి మెట్టు :

ఆ కాలంలో ప్రాంతాలను సమితులుగా విభజించేవారు.దీనిలో భాగం గా మంథని నియోజకవర్గంను మహాదేవపూర్ సమితి, మంథని సమితి అని రెండు సమితులుగా విభజించరు. (అవేనండి ఈ రోజుల్లో బ్లాక్ కమిటి అంటారే .. ) ప్రజల మద్య ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్న శ్రీపాదరావు, మహాదేవపూర్ సమితి అధ్యక్షునిగా ఎన్నికై తరువాత ఎల్ . ఎం. బి చైర్మన్ పదవికి మంథని నుండి గెలిచారు. ఆయన రాజకీయ ఎదుగుదలకు ‘ఎల్ ఎం బి’ బ్యాంకు చైర్మన్ ఎన్నిక ఎంతో సహకరించింది అని అప్పటి నాయకులు చెప్తుంటారు.దీంతో పూర్తిగా నియోజకవర్గానికే ఆయన సుపరిచితమైనాడు. చైర్మన్ గా ప్రజల మద్య అధికారులతో అనునిత్యం తిరుగుతూ ప్రజల వద్దకు పాలన అనే సంకల్పంతో ఎంతో మంది రైతులకు లోన్లు ఇప్పిస్తూ అన్నదాతకు చేయూతగా నిలిచాడు.పదవి వస్తే రాజకీయ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండరు అన్న నినాదంకు భిన్నంగా అయన ప్రజల మధ్యనే ఉంటూ, వారి కష్ట, నష్టాలలో పాలు పంచుకొని ప్రజానాయకునిగా ఎదిగాడు.

రాజకీయ ఎదుగుదలలో రెండవ మెట్టు :

ప్రజల మద్య చురుగ్గా పనిచేస్తూ రాజకీయ నాయకునిగా మంచి పేరు ఘడించిన శ్రీపాదరావుకు కాంగ్రెస్ అధిష్టానం నుండి మంథని ప్రాంతనికి ప్రాతినిద్యం వహించాలని పిలుపువచ్చింది. ఆహ్వానం మేరకు శ్రీపాదరావు 1984 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ‘ఎమ్.ఎల్.ఎ’ గా నామినేషన్ వేసాడు . “1984” రాష్ట్రంలో సినీ ప్రస్థానంలో పేరు ఘడించిన తార ‘ఎన్టీఆర్’ తెలుగు దేశం పార్టీ స్థాపించి ఒక సంచలనాత్మక శకానికి నాంది పలికనన సంవత్సరం. అప్పుడే పురుడు పోసుకున్న తెలుగు దేశం పార్టీ ప్రభావం,ఎన్టీఆర్ ప్రభంజనం ముందు శ్రీపాదరావు విజయం సాదించగలుగుతాడా! అనే అంశం పై స్వపార్టీ, విపక్షాలలో చర్చ జరిగింది. ‘తెలుగుదేశం’, ‘సంజయ్ విచార్’ మంచ్ మధ్య ఎన్నికల ఒప్పందం కారణంగా మంథని నుండి పోటీగా ‘విచార్ మంచ్’ నుండి చంద్రుపట్ల రాజిరెడ్డి దిగారు.వీరిద్దరి మధ్య గట్టి పోటి నెలకొన్న తరుణంలో శ్రీపాదరావుకు ప్రజలతో ఉన్న అభినాబావ సంభంధాలు ఎన్టీఆర్ ప్రభంజనంను చురుగ్గా ఎదుర్కొని చివరకు విజయం సాధించేల చేసింది.కరీంనగర్ జిల్లాలో శ్రీపాదరావు ఒక్కడే కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచాడాంటే శ్రీపాదరావుపై ప్రజల్లో ఉన్న ప్రేమ, ఆదరాభిమానాలు అద్దం పడుతున్నాయని అప్పటి సీనియర్ నాయకులు, స్వపక్షాలు, ప్రతిపక్షాలు మరియు రాజకీయ మేధావులు ఆశ్చర్య పోయారు.

రాజకీయ ఎదుగుదలలో మూడవ మెట్టు :

కరీంనగర్ జిల్లానుండి కాంగ్రెస్ పార్టీ తరపున మంథని ప్రాంత ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనకు PCC మెంబర్ గా స్థానం కల్పించారు.ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు ఎమ్మెల్యేగాఎన్నికై మంథని ప్రజల మన్ననలు పొందాడు .

రాజకీయ ఎదుగుదలలో నాల్గవ మెట్టు :

మూడవసారి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం లో అత్యదిక స్థానాలు కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసారు. మూడు సార్లు ఎమ్మెల్యేగాఎన్నికైన ఆయనకు శాసన సభ స్పీకర్ గా అన్ని పార్టీల మద్దతు లబించటం తో సౌమ్యుడైన శ్రీపాదరావుకు ‘ఆంద్రప్రదేశ్ శాసన సభ స్పీకర్’గా పదవి భాద్యతలు అప్పగించారు.శ్రీపాదరావు ఒక సామాన్య కుటుంబం నుండి ఎదిగిన రాజకీయనాయకుడు కావడంతో ప్రజల కష్ట, సుఖాలు తెలిసిన మహా మేధావి కనుక ప్రభుత్వ విధి-విధానాలపై అసెంబ్లీలో చురుకైన పాత్ర పోషించి,ఆ పదివికే వన్నె తెచ్చారని ఎంతో మంది ప్రముకులు, రాజకీయవిశ్లేషకులు కితాబిచ్చారు.

ఒకవైపు స్పీకర్ పదవిని ఎంతో భాద్యతగా నిర్వ హిస్తూనే, మరోవైపు తన స్వంత నియోజకవర్గ ప్రజలను ఏ మాత్రం మరిచిపోకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలే పభుత్వం అనే నినాదంతో మరింత దగ్గరయ్యారు.విమర్శలకు వెరవకుండా, పొగడ్తలను లెక్క చేయకుండా, అభివృద్ది ఫై దృష్టి సారిస్తూ ముందుకు కదిలారు.మారుమూల ప్రాంతమైన మంథని అభివృద్ధిలో అడుగడుగున శ్రీపాద ఛాయలు కనిపిస్తాయంటే అతిశయోక్తి  లేదు .

జీవిత యాత్రలో చివరి అంకం :

1994 ఎన్నికల ముందు నక్సల్స్, పోలీసుల మధ్య జరిగిన ప్రత్యక్ష పోరు తీవ్రంగా ప్రభావం చూపింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో శ్రీపాదరావు పరాజయం పాలయ్యాడు. అయిన ఓటమి పాలయిన ప్రజలకు మాత్రం దూరం కాలేదు. వారి మధ్య లోనే ఉంటూ వారికి తన శక్తి మేరకు సేవ చేస్తూ వచ్చాడు. పాలకపక్షం, ప్రాతినిధ్యం వహిస్తున్న అప్పటి ఎమ్మెల్యే రాంరెడ్డి పై కనీసం పల్లెత్తు మాట, విమర్శ కూడా చేయకుండ హుందాగా వ్యవహరించి ప్రజాభిమాన్ని సాధించాడు .

మృత్యువు నక్సల్స్ రూపంలో :

ప్రజల మధ్య ఉంటూ వారి బాగోగులనుపట్టించుకునే పరిస్థితుల్లోనే ఆయనను మృత్యువు నక్సల్స్ రూపంలో కబళించింది. 1999 ఏప్రిల్ 13న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతట నీలి ఛాయలతో నిండి పోయింది .ఒక్కసారిగ మంథని ప్రాంతమంత శోకవనంలో మునిగిపోయింది. ఎటు చూసిన చీకట్లు కమ్మిన వాతావరణం . మహాదేవపూర్ మండలం అన్నారం కు తన అనుచర వర్గంతో వెళ్లి వస్తున్న క్రమంలో మార్గ మధ్య లోని అడవుల్లో శ్రీపాదరావు వాహనాన్నినక్సల్స్ ఆపివేసి, ఆయనతో మాట్లాడాలని చెప్పి లోపలి తీసుకెళ్ళి కరుకు తుపాకి తూటాలతో విగత జీవున్ని చేశారనే వార్త తెలవగానే ప్రజలలో నక్సల్స్ పై ఆక్రోశం ఒక్కసారిగా ఉప్పెనల బయటికి వచ్చింది. ప్రజా నాడి అయిన శ్రీపాదరావును హతమార్చిన విషయం తెల్సుకున్న ప్రజలు నక్సల్స్ ను “ఎవరిపైన మీ యుద్ధం ,ప్రజల పైననా? ప్రజా హృదయం పైనన?” అంటూ గలమెత్తుకున్నారు. ఎన్నడు అపకారాన్ని తలపెట్టని నాయకున్ని నిష్కారణంగా హతమార్చిన నక్సల్స్ ఫై విమర్శలు గుప్పు మన్నాయి. రాజకీయంగా అనిశ్చిత పరిస్థితి నెలకొంది. ప్రజల కోసం తుపాకులు పట్టినట్లు చెప్పుకొనే నక్సల్స్ ఇలాంటి దుశ్చర్య కు పాల్పడడం ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగా విమర్శించారు. అప్పటి రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు సైతం హుటా హుటిన మార్చురీలో ఉన్న మృత దేహాన్ని చూసేందుకు తరలి వచ్చారు. నక్సల్స్ కు వ్యతిరేఖంగా నినాదాలు చేస్తూ, 40వేల మందికి పైగా కన్నీటి పర్యంతమై శ్రీపాదరావు అంత్య క్రియల్లో పాల్గొన్నారు.

నక్సల్స్ చారిత్రాత్మక తప్పిదం :

విమర్శలకు స్పందించిన పీపుల్స్ వార్ అగ్రనాయకత్వం, కేంద్ర కమిటీ సబ్యుడు సంతోష్, శ్రీపాదరావును హతమార్చడం నక్సల్స్ యొక్క చారిత్రాత్మక తప్పిదం అని పేర్కోన్నాడు . ఒక ప్రజా నాయకున్ని అన్యాయంగా చంపామంటూ తప్పు ను ఒప్పుకున్నారు .

ప్రజాభిప్రాయం :

ఎవరు తప్పు ఒప్పుకుంటే ఏంటి ? శ్రీపాదరావు లాంటి ప్రజా హృదయ నేత, అజాత శత్రువు మనకికలేడు కదా ! అలాంటప్పుడు శ్రీపాదరావును అన్యాయంగా హతమార్చిన నక్సల్స్ విషపూరిత చర్యలకు అడ్డు కట్ట వేయాల్సిందే అంటూ ఆనాడు యావత్ రాష్ట్రం నినాదించింది.

మరచిపోలేని విషయాలు :

ఉపయోగించిన వాహనాలు :  సైకిల్, బైక్, ఎడ్లబండి, జీపు, అంబాసిడర్.

ఉపయోగించిన వస్త్రాలు :  కాటన్ దోవతి, ఖద్దర్ లాల్చి .

ఇష్టమైనవి : మక్క కంకులు, మిర్చి బజ్జి, దోశలు .

ఇష్టపడే హోటల్స్ : కరీంనగర్ గీతాభవన్,గోదావరిఖని సాయిలీల హోటల్, మంథని అయ్యన్న హోటల్.

ఇష్టమైన స్వీట్స్ : కాశ్మీర్ కళకంద్ (పెద్దపల్లి మిలాన్ హోటల్), అజ్మీర్ కళకంద్(పెద్దపల్లి మిలాన్ హోటల్)

ముద్దు పేర్లు : బుచ్చి పంతులు, చిన్న పంతులు .

శ్రీపాదరావు ముఖ్య అనుచరులు : పనకంటి కిషన్ రావ్ (మంథని),మల్యాల రాజన్న (గుంజపడుగు),ధమ్మి రెడ్డి (గుమ్మర్లపల్లి),బంధం మల్లా రెడ్డి (గంగారం) , రాజి రెడ్డి (బయ్యారం) , ఒరేటి రాజి రెడ్డి (ఓడేడ్) , బొమ్మన రాంరెడ్డి (గంగారం) , చిన్న మల్లా రెడ్డి (కాళేశ్వరం) , శంకరయ్య (సూరారం) , వెంకన్న (పంకెన) , మంత్రి మల్లయ్య(కాటారం) , బెఘ్(అంకుసాపూర్) , సుగ్ర్హివరావ్(ములుగు) , నాగ భూషణ్(కమాన్ పూర్) , జగదీశ్వర్(కమాన్ పూర్) , బాపన్న(బేగంపేట్) , తోట నారాయణ పటేల్ (కమాన్ పూర్), సుధాకరరావు (కమాన్ పూర్) , కర్రె బాపు (చింతకాని) , జగన్ (కన్సాయ్ పేట) .

 •  ప్రజలు అభిమానం తో ఎలక్షన్స్ లో చందాలు వేసుకొని ప్రజా హృదయనేత శ్రీపాదరావు గారిని గెల్పించడం .
 • స్పీకర్ లాంటి అత్త్యుత్తమ స్థానంలో ఉన్నప్పటికీ అను నిత్యం ప్రజల మద్య తిరిగిన జన హృదయనేత .
 • మల్లారం – తాడిచెర్ల, సూరారం – అంబట్ పల్లి, కాటారం – మహాముత్తారం, అన్నారం – కాళేశ్వరం మరియు ఆరెంద – వెంకటాపూర్ రోడ్లు వేపించి మారుముల ప్రాంతమైన మంథని నియోజక వర్గంలో రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయించింది మన శ్రీపాదరావు గారే .
 • మంథనిలో సంగీత కళాశాల ఏర్పాటు చేపించిన ఘనత శ్రీపాదరావు గారిది .
 • వల్లెంకుంట లిప్ట్ ఇరిగేషన్, స్వర్నపల్లి లిప్ట్ ఇరిగేషన్, ఆరెంద, పంకెన లిప్ట్ ఇరిగేషన్, అన్నారం లిప్ట్ ఇరిగేషన్ శ్రీపాదరావు గారితోనే సాధ్యమైంది .
  ధన్వాడ, వల్లెంకుంట, చింతకాని, మంథని … ఒక్కేసారి 12 వాటర్ ట్యాంక్ లు, మంథని లో సబ్-స్టేషన్ మరియు ‘రింగ్ రోడ్’కు మూల కారణం శ్రీపాదరావుగారు .
 • మంథని నియోజకవర్గ అన్నదాతలకు వాటర్ సప్లయ్ , కరెంట్ సప్లయ్ సరైన సమయం లో అందించి రైతన్న కు అండగా నిలిచిన స్నేహ శీలి శ్రీపాదరావు గారనే అక్షర సత్యం ముమ్మాటికి మరిచిపోలేనిది .
 • తాడిచెర్ల, వల్లెంకుంట, అంబట్ పల్లి, ములుగు పల్లి, మంథని, మహాదేవపూర్ లలో ఆసుపత్రులను ఏర్పాటు చేపించింది దుద్దిళ్ళ శ్రీపాదరావుగారే .
  జ్ఞానపీట్ అవార్డు పొంది, ‘ఆంధ్రప్రదేశ్ స్పీకర్’గా బాద్యతలు నిర్వహించి , అమెరిక లాంటి దేశాలనుండి ఆహ్వానం పొంది మంథని పేరు ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన నేత శ్రీపాదరావు గారే.
 • స్వపక్షమే కాక, ప్రతిపక్షాలు, పాలకపక్షాలు మెచ్చుకున్ననేత దుద్దిళ్ళ శ్రీపాదరావుగారనే మాట వాస్తవం.
 • నక్సల్స్ సహితం శ్రీపాదరావుగారి విషయంలో చారిత్రాత్మక తప్పిదం చేశామని పశ్చాతాపం పొందారంటే జననేత శ్రీపాదరావు అజాత శత్రువు.
 • తన చివరి రక్తం చుక్క వరకు తన జీవితాన్ని ప్రజల కొరకు దారబోసారంటే అది శ్రీపాదరావు గారనే విషయం మనం ఎప్పటికి మరచిపోలేము .

అయన మరణించిన.. ఇప్పటికి ప్రజలహృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు… ఆ ఉన్నత ప్రజా నాయకునికి హృదయ పూర్వక నివాళులు… మరువదు శ్రీపాద నిను మంథని ప్రజా ! శ్రీపాద రావు అమర్ హై !!