Latest
Home » Our Leaders » Rahul Gandhi

Rahul Gandhi

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడు, భారత యువజన కాంగ్రెస్, భారత జాతీయ విద్యార్థి యూనియన్ లకు చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. అఖిలభారత కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు ఆయన. అమేథీ నియోజకవర్గం నుంచి ఎంపిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో రెండవ అతిఎక్కువ ర్యాంకు సాధించిన సభ్యుడు రాహుల్.

జననం:

19 జూన్ 1970న రాహుల్ ఢిల్లిలో జన్మించారు.ఆయన భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీ ల మొదటి సంతానం. ఆయన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ  మనవడు.  భారత మొట్టమొదటి ప్రధాని  జవహర్  లాల్  నెహ్రూ కు మునిమనవడు. ఆయన చెల్లెలు ప్రియాంక వాద్రా, బావ  రాబర్ట్ వాద్రా.

తొలినాళ్ళ జీవితం, కెరీర్:

రాహుల్ మొదట ఢిల్లీ లోని సెయింట్ కొలంబా పాఠశాలలో చేరారు.1981 నుండి 1983 వరకు ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ది డూన్ పాఠశాలలో చదువుకున్నారు. ఆ తరువాత కొద్ది రోజులకే ఆయన నానమ్మ, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ని దుండగులు  చంపడంతో, తండ్రి రాజీవ్ 31 అక్టోబరు 1984న ప్రధానమంత్రి అయ్యారు. సిక్కు ఉగ్రవాదుల నుంచి వీరి కుటుంబానికి బెదిరింపులు రావడంతో రాహుల్, ఆయన చెల్లెలు ప్రియాంకాను ఇంట్లోనే చదివించడం ప్రారంభించారు రాజీవ్.1989లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో చేరిన  రాహుల్, మొదటి సంవత్సరం పరీక్షలైపోయిన తరువాత హార్వర్డ్  విశ్వవిద్యాలయంలో చేరారు.1991లో తమిళ ఉగ్రవాదుల చేతిలో రాజీవ్ గాంధీ చనిపోయిన తరువాత భద్రతా కారణాల దృష్ట్యా రాహుల్ రోలిన్స్ కళాశాలకు మారిపోయారు. 1994లో బి.ఎ పూర్తి చేశారు ఆయన.ఆ సమయంలో ఆయన రౌల్ విన్సి అనే మారుపేరుతో చదువుకునేవారు. ఆయన అసలు పేరు, వివరాలు కొందరు భద్రతా, విశ్వవిద్యాలయ అధికారులకు మాత్రమే తెలుసు.1995లో కేంబ్రిడ్జ్ లోని  ట్రినిటీ కళాశాలలో ఎం.ఫిల్ చదివారు. ఆ తరువాత 1995లో లండన్ లోని మానిటర్ గ్రూప్ అనే మేనేజ్ మెంట్ కన్సల్టింగ్ సంస్థలో ఉద్యోగం చేశారు.2002లో ముంబైలో బాకొప్స్ సర్వీసెస్ ప్రైవేట్  లిమిటెడ్ అనే టెక్నాలజీ ఔట్ సోర్సింగ్ సంస్థను స్థాపించారు.

రాజకీయం:

ఆయన తండ్రి రాజీవ్ గాంధీ చనిపోయిన తరువాత కొన్నేళ్ళకు, ఆయన పోటీ చేసే ఉత్తరప్రదేశ్ లోని అమేథీ నియోజకవర్గంలో నిలబడి ఎంపిగా గెలిచారు. 2007లో రాహుల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2013లో పార్టీ ఉపాధ్యక్షునిగా కూడా ఎన్నికయ్యారు.

2014 భారత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి సారథ్యం వహించారు రాహుల్. ఈ ఎన్నికల్లో కేవలం 44 సీట్లు గెలిచి పార్టీ చరిత్రలో అతి దారుణమైన వైఫల్యాన్ని చవి చూసింది. నిజానికి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 206 సీట్లను గెలుచుకుంది.