Latest
Home » Our Leaders » Manmohan Singh

Manmohan Singh

భార‌త‌దేశ 14వ ప్ర‌ధానిగా ప‌నిచేసిన డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్‌సింగ్ ఆలోచ‌నాప‌రుడుగా, మేధావిగా స‌రైన గుర్తింపు పొందారు. ప‌నితీరులో సామ‌ర్థ్యం, దృక్ప‌థం ప‌రంగా స‌ర్వాద‌ర‌ణ పొందారు. స‌మ‌స్య‌ల ప‌ట్ల స్పంద‌న‌, న‌డ‌వ‌డిలో కూడా త‌న‌దైన ముద్ర వేసుకున్నారు.అనేక అర్హతలు కల సింగ్ 1991లో ఆర్థిక శాఖా మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణ ల వలన ప్రస్తుత భారత చరిత్రలో ముఖ్యుడిగా భావింపబడుతున్నాడు. మరియు ఇంతటి విద్యా మరియు సేవలలో అనుభవం కలిగిన ప్రధానమంత్రి ప్రపంచంలోనే లేడంటే అతిశయోక్తికాదు.

జననం, కుటుంబము:

26 సెప్టెంబర్, 1932 లో పంజాబ్ (ఇప్పటి చక్వాల్, పాకిస్తాన్) లో ఒక కోహ్లీ కుటుంబములో గురముఖ్ సింగ్,అమ్రిత్ కౌర్ దంపతులకుజన్మించారు.1958 లో గురుషరణ్ కౌర్తో వివాహమాడిన డా.సింగ్ కు ముగ్గురు కుమార్తెలు. వాళ్ళు ముగ్గురూ మతాంతర వివాహాలే చేసుకోవడం విశేషం.

విద్య:

1948లో పంజాబ్ యూనివ‌ర్శిటీ నుంచి మెట్రిక్యులేష‌న్ పూర్తిచేశారు.

అర్థశాస్త్రములో 1952 లో బ్యాచిలర్స్ డిగ్రీ, 1954లో మాస్టర్స్ డిగ్రీ పంజాబ్ విశ్వవిద్యాలయము, ఛండీగడ్ నుండి చేసారు.

1957లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయము లో ఎక‌నామిక్స్‌ లో ఫ‌స్ట్‌ క్లాస్ ఆన‌ర్స్ డిగ్రీ తీసుకున్నారు

1962లో ఆక్స్‌ ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలోని నఫ్పీల్డ్ కాలేజీ నుంచి ఎక‌నామిక్స్ లో డీఫిల్ తీసుకున్నారు.

ఉద్యోగాలు:

1957-59 : సీనియర్ లెక్చరర్, ఆర్థికశాస్త్రం.

1959-63 : రీడర్, ఆర్థికశాస్త్రం.

1963-65 : ప్రొఫెసర్, ఆర్థికశాస్త్రం, పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్.

1969-71 : ప్రొఫెసర్, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఢిల్లీ విశ్వవిద్యాలయం.

1976 : గౌరవ ప్రొఫెసర్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఢిల్లీ విశ్వవిద్యాలయం.

రచనలు:

ఆయన పుస్త‌కం ‘ఇండియాస్ ఎక్స్‌ పోర్ట్ ట్రెండ్స్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఫ‌ర్ సెల్ఫ్ -స‌స్టెయిండ్ గ్రోత్’ (క్లారెండ‌న్ ప్రెస్‌, ఆక్స్‌ ఫ‌ర్డ్‌, 1964) భార‌తదేశ అంత‌ర్గ‌త కేంద్రీకృత వాణిజ్య విధానానికి తొలి విమ‌ర్శ‌నా ర‌చ‌న‌గా గుర్తింపు పొందింది.

పురస్కారాలు:

ప్ర‌జా జీవితంలో డాక్ట‌ర్ సింగ్ ఎన్నో అవార్డులు, పుర‌స్కారాలు అందుకున్నారు. భార‌త అత్యున్నత పౌర పుర‌స్కారాల్లో రెండ‌వది అయిన ప‌ద్మ విభూష‌ణ్ (1987)తో బాటు, జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ బ‌ర్త్ సెంటిన‌రీ అవార్డ్ ఆఫ్ ది ఇండియ‌న్ కాంగ్రెస్ (1995), ది ఆసియా మ‌నీ అవార్డ్ ఫ‌ర్ ఫైనాన్స్ మినిస్ట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ (1993) మ‌రియు (1994), ది యూరో మ‌నీ అవార్డ్ ఫ‌ర్ ఫైనాన్స్ మినిస్ట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ (1993), ద ఆడ‌మ్‌స్మిత్ ప్రైజ్ ఆఫ్ ద యూనివ‌ర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ (1956), రైట్స్ ప్రైజ్ ఫ‌ర్ డిస్టింగ్ విష్ట్ ఫ‌ర్మార్మెన్స్ ఎట్ సెయింట్ జోన్స్ కాలేజ్ ఇన్ కేంబ్రిడ్జ్ (1955) మొద‌లైన అవార్డుల‌ను అందుకున్నారు. జ‌పాన్‌కు చెందిన నిహాన్ కిజై షింబ‌న్ తో స‌హా అనేక అసోసియేష‌న్‌ల నుంచి పుర‌స్కారాల‌ను కూడా అందుకున్నారు. అలాగే, యూనివ‌ర్శిటీస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ అండ్‌ ఆక్స్‌ ఫ‌ర్డ్‌ తో స‌హా అనేక యూనివ‌ర్శిటీల నుంచి గౌర‌వ డాక్ట‌రేట్లు కూడా పొందారు.

అంతర్జాతీయ అసైన్‌మెంట్లు:

అనేక అంత‌ర్జాతీయ స‌ద‌స్సుల‌కు, ప‌లు అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌కు డాక్ట‌ర్ సింగ్ భార‌త్ నుంచి ప్రాతినిథ్యం వ‌హించారు.

1966 : ఆర్థిక వ్యవహారాల ఆఫీసరు.
1966-69 : యు.ఎన్.సి.టి.ఏ.డి. (UNCTAD), ఛీఫ్, ఫైనాన్సింగ్ ఫర్ ట్రేడ్ సెక్షన్.
1972-74 : ఐ.ఎమ్.ఎఫ్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫోరమ్ కొరకు, భారత తరఫున డిప్యూటీ.
1977-79 : ఎయిడ్-ఇండియా కన్సార్టియమ్ మీటింగుల కొరకు భారత రాయబారి.
1980-82 : ఇండో-సోవియట్ జాయింట్ ప్లానింగ్ గ్రూప్ మీటింగ్
1982 : ఇండో-సోవియట్ మానిటరింగ్ గ్రూప్ మీటింగ్

1993లో సైప్ర‌స్‌లో జ‌రిగిన కామ‌న్వెల్త్ ప్ర‌భుత్వాధినేత‌ల స‌మావేశానికి,

1993లో వియ‌న్నాలో మాన‌వ‌హ‌క్కుల‌పై జ‌రిగిన ప్ర‌పంచ స‌ద‌స్సుకు హాజ‌రైన భార‌త ప్ర‌తినిధి వ‌ర్గాల‌కు డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్‌సింగ్ నాయ‌క‌త్వం వ‌హించారు.

రాజకీయం:

1991 నుంచి 1996 వర‌కు డాక్ట‌ర్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్న ఐదు సంత్స‌రాల కాలం స్వ‌తంత్ర భార‌త‌దేశ ఆర్థిక చ‌రిత్ర‌ను కీల‌క మ‌లుపు తిప్పింది. ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌కు సంబంధించి స‌మ‌గ్ర విధానం ఆవిష్క‌ర‌ణ‌లో ఆయ‌న నిర్వ‌హించిన పాత్ర నేడు ప్ర‌పంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. భార‌త‌దేశంలో ఆ స‌మ‌యం డాక్ట‌ర్ సింగ్ వ్య‌క్తిగ‌త జీవితంతో ముడిప‌డింద‌న్న‌ది ప్ర‌జాభిప్రాయం.

డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్‌సింగ్ త‌మ రాజ‌కీయ జీవితంలో 1991 నుంచి భార‌త పార్ల‌మెంట్ ఎగువ స‌భ (రాజ్య‌స‌భ‌) స‌భ్యునిగా ఉన్నారు. 1998 – 2004 మ‌ధ్య ప్ర‌తిప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రించారు. 2004 సాధార‌ణ ఎన్నిక‌ల త‌రువాత మే 22వ తేదీన దేశ ప్ర‌ధానిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. తిరిగి వ‌రుస‌గా రెండ‌వ ప‌ర్యాయం కూడా 2009 మే 22న ప్ర‌ధాన‌మంత్రి ప‌గ్గాలు చేప‌ట్టారు.

వినోదాలు క్రీడలు:

జిమ్‌ఖానా క్లబ్, న్యూఢిల్లీ శాశ్వత సభ్యుడు.
ఇండియా ఇంటర్నేషనల్ సెంటరు న్యూఢిల్లీ, శాశ్వత సభ్యుడు.