Latest
Home » Organizations » Sripada Charitable Trust

Sripada Charitable Trust

శ్రీపాదరావు అకాల మరణానంతరం కుటుంబ సభ్యులు మరియు దుద్దిళ్ల ఆత్మీయులు, శ్రీపాదరావు స్మారకంగా ప్రజలకు అనునిత్యం ఎదో ఒక సేవ చేయాలి, నిరు పేదలు లబ్ది పొందాలని, ఆయన పేరు చిరకాలం ప్రజల మదిలో ఉండాలనే ఒక గొప్ప ఆలోచనతో పుట్టినదే శ్రీపాద ట్రస్ట్. దుద్దిళ్ల శ్రీపాదరావు గారి చిన్న కుమారుడు దుద్దిళ్ల శ్రీను బాబు ట్రస్ట్ కి చైర్మన్ గా వ్యవహరించగా అనేక మంది దీనిలో సభ్యులుగా ఉంటూ అనునిత్యం ఎదో ఒక సేవ, సామాజిక కార్యక్రమం చేస్తున్నారు. శ్రీపాదరావు గారి కుటుంబ సభ్యులు తమ జీతం నుండి కొంత ట్రస్ట్ కోసం వెచ్చిస్తూ అనునిత్యం నిరుపేద ప్రజలకు అండగా మేమున్నాం అంటూ తలుపు తడుతూనే ఉన్నారు.

శ్రీపాద ట్రస్ట్ ద్వారా చేసే కార్యక్రమములు

  • పేద విద్యార్థులకు పుస్తకాలు, బట్టలు అందిచడం.
  • నిరుపేద ప్రజల పిల్లలకు చదువు చెప్పించడం.
  • విద్యార్థులను వివిధ రంగాలలో ప్రోత్సహిస్తూ సహాయ సహకారాలు అందించడం.
  • మెరిట్ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇవ్వడం
  • పేద విద్యార్థులను ఉన్నత చదువుకై ప్రోత్సహించడం
  • కాంపిటీటివ్ పరీక్షలు నిర్వహించి వక్తిత్వ వికాసం, పోటీ తత్వం పెంపొందించడం
  • యువకులను క్రీడారంగంలో ప్రోత్సహించడం
  • నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కై కృషి చేయడం
  • మహిళలను వివిధ రంగాలలో ప్రోత్సహిస్తూ శిక్షణ తరగతులు నిర్వహించడం
  • పల్లెలలో వీధి దీపాలు ఏర్పాటు చేయడం
  • వికలాంగులకు ఆర్ధిక సహాయం అందించడం.
  • పేదలకు వైద్య ఖర్చులు ఇవ్వడం.
  • నీరు పేదలకోసం గ్రామాలకే డాక్టర్లను తీసుకవచ్చి వైద్య సేవలు అందించడం.
  • గ్రామ ప్రజలకోసం మెడికల్ క్యాంపులు నిర్వహించడం
  • గ్రామాలలో పచ్చని చెట్లు పెంచి పల్లె వాతావరణాన్ని కాపాడటం.