Latest
Home » Duddilla Speaks

Duddilla Speaks

చూస్తుండగానే 18 సంవత్సరాలు !

ఆనాడు దాదాపు ఇదే సమయంలో (3.30Pm) నేను ఆ రోజు కొర్టుకు వెళ్లి వస్తున్న తరుణంలో ఒక వార్త రావడం , ఉన్నపలంగా  కుటుంబమంతా మంథని రావాలని ఆ రోజు పోలీసు వారు చెబితె ఆశ్చర్యంతో,ఆందోళనతో చాల వరకు ఈ రోజు కూడా తీవ్ర దిగ్భ్రాంతితో వున్న మా కుటుంబ సభ్యులం మంథని కి వచ్చాము.మాకు అండగా నిలబడ్డ మా తండ్రి గారిని కోల్పోవడం జరిగింది.ఆ బాధ ఇప్పటికు మరువలేనిది,కాని ఆ బాధను మర్చి పోవాలంటే మా నాన్న గారిని ప్రోత్స హించిన అభిమానించిన నాయకులు అభిమానులు మేము ఆ రోజు ఉన్న సమయములో ఎవరో ఒకరు కుటుంబం నుండి రాజకీయాల్లో కి రావాలని చెప్పినప్పుడు చాల ఆలోచించడం జరిగింది . అలాంటి సమయములో వారి ఆశయాలను నెరవేర్చేందుకు రాజకీయాల్లో కి అడుగుపెట్టడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.

మీ అందరికి తెలుసు 14 సంవత్సరాలు గడిచాయి.మొదటి సంవత్సరం చాల కష్టంగా గడిచిపొయింది.రెండవ సంవత్సరంలో రాజకీయం నేర్చుకునే ప్రయత్నం చేసాం.మూడవ సంవత్సరంలో పార్టీ కి అధ్యక్షునిగా పెద్దలు సత్యనారాణ గారు నియమించారు ఆ రోజు ప్రతి పక్షం లో ఉన్న మేము ప్రజా సమస్యలపై ప్రతీ అంశం పై మమేకం అయ్యేందుకు కృషి చేసాము.

“నేనప్పుడు అనుకోలేదు రెండవసారి ఎన్నికైతా ! …మూడవసారి ఎన్నికైతా ! … “అని .
రాజకీయాల్లో కి వచ్చాం కాబట్టి యువకునిగా ప్రజా అనుభవంతో పాటు అన్ని నేర్చుకుంటాం అనే ధీమాతో వూరూర పల్లె పల్లెన తిరగడం జరిగింది.

మరి నేను 2004 లో పెద్ద ఎత్తున మీ అందరి ఆశీర్వాదం తో గెలిచిన సందర్భంగా రాష్త్రంలో పెద్ద దేవాలయం అయిన శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువులో ఒక సభ్యునిగా నిలవడం జరిగింది .తదుపరి గవర్నమెంట్ విప్ గా శాసనసభా వ్యవహారాల గురుంచి అవకాశం వచ్చింది.మూడవసారి ఎన్నిక వచ్చినప్పుడు అంటే కాంగ్రేస్ పార్టి కి సంబందించి మూడవసారి ఎన్నికైన తరువాతే నువ్వు మంత్రి పదవికి అర్హుడవని మరి చాలా మంది సీనియర్లు వుండటం చేత ఆ సీనియర్లందరి తరువాత నాకు మంత్రి పదవి అవకాశం చాల రోజుల తరువాత వచ్చింది .

మా నాన్న గారు చెప్తుండే వారు , ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాంటే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కావాలని ఈ ప్రాంతములో ‘డిగ్రీ ‘ , ‘ఐ.టి .ఐ ‘, ‘పాలిటెక్నిక్’ కళాశాలలు ఏర్పడితే విధ్యార్థులకు ఉపయోగపడుతదని ఎప్పుడూ  అనేవారు అవన్ని మదిలో వున్నయి . కాబట్టే మరి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాకా నాన్న గారి ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజల అభిమానముతో మంత్రి పదవి రావడం వల్ల ఈ రోజు గ్రామ గ్రామాన అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నాము.

మా నాన్న గారు చాల కష్టపడ్డారు . నేను మొదటి సారి మహా ముత్తారం మీటింగ్ పోతుంటే మరి మా మిత్రుడు భేగయ్య చెప్తుండే ! మా నాన్న గారు ఇదే మహా ముత్తారం మీటింగ్ కు మొదటిసారి శాసన సభకు ఎన్నికైనప్పుడు ఐదు కిలోమీటర్లు కాలినడకన వెళ్లెవారు అని . ప్రజల మన్ననలు పొందాలనే ఆలోచన దృక్పదం తో చివరి దాకా ప్రజల మధ్యే జీవనం సాగించారు.

నాకు 2004 లో ఎన్నికల ప్రచారానికి పొయినప్పుడు గ్రామాలలో గుడిసెలను చూసి గట్టి పట్టుదల వుండే , గ్రామాలలో పకట్బందీగా ఎలాగైనా నాకున్న రాజకీయ స్నేహితుల కృషితో ఇళ్ళు నిర్మించాలి. మా నాన్న గారి ఆశీర్వాదం వల్ల ఎన్నికైన తరువాత ఆ దేవుని ఆశీస్సులతో రాష్త్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ పథకం ద్వారా పెద్ద ఎత్తున ప్రతీ గ్రామం లో నిరుపేదలకు ఇళ్ళు ఇవ్వడం జరిగింది.మరి ఇంత పెద్ద వ్యవస్థ లో కొంత మందికి రాక పోవచ్చు వారికి కూడా పూర్తి స్తాయిలో ఇళ్ళు మంజూరు కావడానికి నా వంతు కృషి చేస్తాను .

కాళేశ్వరం ఎత్తి పోతల పథకం కోసం రెండు సంవత్సరాలు ఎ.ఇ,డి.ఇ దగ్గర నుండి ప్రతి ఒక్కరి వద్దకు నేను స్వతహాగా ఎం .ఎల్ .ఏ గా వున్నప్పుడు ఫైల్ పట్టుకొని తిరగడం జరిగింది. చివరగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి , ఇది మా ప్రాంతానికి సంబందించి చాల ముఖ్యమైనది ; మా నాన్న గారు ఆలోచించినది అని చెప్పడంతో ఆ రోజు సంతకం చేయించుకొని ఈ రోజు నిధులతో నిర్మాణం జరుగుతుంది .

శ్రీధర్ బాబును నమ్ముకున్న మా ప్రాంత ప్రజలకు ఎప్పుడు అండగా వుంటా.ఈ రోజు డిగ్రీ కళాశాలలు , ఐ.టి.ఐ కళాశాలలు , జూనియర్ కళాశాలలు , ఇంజనీరింగ్ కళాశాల విధ్యార్థుల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే కాలం లో పెద్ద ఎత్తున ఎక్కడ వెనుదిరగకుండా అభివృద్దికోసం కృషి చేస్తా.

ఈ రోజు శ్రీధారా లిఫ్ట్ ఇరిగేషన్ కాని , పోతారం లిఫ్ట్ ఇరిగేషన్ కాని , శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కాని , గుండారం రిజర్వాయిర్ కాని , ఎస్సారెస్పి 6 L కాని … ఇలా ఎన్నో పథకాల ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం లో కాంగ్రెస్ ప్రభుత్వం తో వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి .

నాకు ఈ గూండా రాజకీయం రాదు . నేను ఎమైనా మాట్లాడాలంటే వ్యక్తిగతంగా పది మంది ముందర మాట్లాడే రాజకీయం రాదు . హైదరాబాదులో చాలా ఆలోచన చేసి అత్యవసర పరిస్థితుల లో మా ముఖ్యమంత్రి మరియు మా ప్రభుత్వం పై విమర్శలు తారా స్థాయి లో వున్నప్పుడే మాట్లాడుతా . నేనకున్న ఆశయం ‘ఈ రోజు కాని ఎప్పుడూ చెప్తుంటా పేదవాడి గుండెల్లో ఒక స్థానం సంపాదించుకోవాలని ‘ మా నాన్న గారి ఆరాటం . ఆ ఆరాటాన్ని విస్మరించకుండా ఏమైనా లోపాలుంటే సవరించుకుంటూ రాజకీయాల్లో వున్నంత వరకు ముందుకు సాగుతా . మా మంథని నియోజక వర్గ ప్రజలే ఈ రోజు ‘అమ్మ – హస్తం ‘ పథకంలో విధానపర కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం నాకు కలిపించి ఈ రాష్ట్రం లోని పేద ప్రజలకు నిత్యవసర సరుకులు అందించేలా కృషి చెసినందుకు ధన్యవాదాలు .

ఈరోజు నేను ప్రతి పక్షంలో ఉండొచ్చు కానీ ప్రజలను మాత్రం ఎన్నడూ మర్చి పోలేదు. ఈరోజు కూడా చెప్తున్నా నేను రాజకీయాలలోకి అనుకోకుండా వచ్చా. ఈ ప్రాంత ప్రజలకు నిత్యం సహాయం చేయాలి, అభివృద్ధి పథంలో నిలపాలి అని మా నాన్న గారు తపించేవారు. వారి ఆశయాలను ముందుకు నడిపించే క్రమంలో రాజకీయాలలోకి వచ్చిన నేను, శ్రీపాద రావుగారు నిష్క్రమించిన  అడవి తల్లి సాక్షిగా చెప్తున్నా ! ఎప్పుడు ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసమే పనిచేస్తా. మంథని నియోజక వర్గ  ప్రజల అభివృద్దే దుద్దిళ్ల ఆలోచన. దీర్ఘకాల ప్రయోజనాల కోసమే ఎప్పుడు కృషి చేస్తా. నా వెంట ఉంటూ నిరంతరం వెన్నుతడుతూ నా మార్గంలో నడిచే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.

సదా మీ సేవ కొరకై
దుద్దిళ్ల శ్రీధర్ బాబు