Latest
Home » About Sridhar Babu » Political career

Political career

దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తన తండ్రి దుద్దిళ్ళ శ్రీపాద రావు అకాల మరణానంతరం 1999 లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. శ్రీధర్ బాబు మంథని నియొజకవర్గం నుండి 1999, 2004 మరియు 2009 ఎన్నికలలో వరుసగా మూడు సార్లు ఎం.ఎల్.ఎ గా గెలుపొందాడు.

మొదటి సారి (1999-2004):

శ్రీపాద రావు అకాల మరణానంతరం తరవాత 1999లో అసెంబ్లీ ఎలెక్షన్స్ వచ్చాయి. ఈ ప్రాంత ప్రజలతో నేరుగా పరిచయం లేని దుద్దిళ్లకు రాజకీయలు కొత్తగా అనిపించాయి. ఉన్నత చదువులు చదువుకున్న శ్రీధర్ బాబు 1999లో మొట్ట మొదటి సరిగా కాంగ్రెస్ పార్టీ నుండి మంథని ఎం.ఎల్.ఏ గా నామినేషన్ వేసాడు. అప్పటికే రాష్ట్రంలో టి.డి.పి పార్టీ బలంగా ఉండడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు జైత్రయాత్ర సాగుతున్న రోజులు. అధికార పార్టీ టి.డి.పి నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్ రెడ్డి నామినేషన్ వేయగా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఒక వైపు తండ్రి దుద్దిళ్ల శ్రీపాదరావు మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన శ్రీపాద తనయుడు దుద్దిళ్ళ పై ప్రజల సానుభూతి రోజు రోజు కి పెరిగిపోయింది. చదువుకున్న వాడు, యువకుడు అంటూ నాయకులు ప్రచారం చేస్తూ దుద్దిళ్ళకు మంథని ప్రజల ప్రజాధారణ కూడగట్టారు. తన సమీప ప్రత్యర్థి అప్పటి ఎమ్మెల్యే రామ్ రెడ్డి (టి.డి.పి పార్టీ) ఫై 15,000 ఓట్ల మెజార్టీతో గెలుపొంది మంథనిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేశాడు. గెలిచిన తర్వాత మంథని నియోజక వరం పూర్తి స్థాయిలో పర్యటించి పలు సమస్యలను అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుక వెళ్లి ప్రజా పక్షాన పోరాటం చేసాడు.

రెండవ సారి (2004-2009):

అది 2004 ఎలక్షన్స్. రాష్ట్రమంతటా అప్పటి అధికార పార్టీ (టి.డి.పి) చంద్రబాబు , ప్రతిపక్షనేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి (కాంగ్రెస్) రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలో భాగంగా మంథనిలో సభలు ఏర్పాటు చేసారు. ప్రజలంతా అప్పటికే కరువు కాటకాలతో అల్లాడిపోతున్నారు. శ్రీధర్ బాబు మంథనికి నిధులు ఇవ్వాలంటూ పలుమార్లు ముఖ్యమంత్రి స్థాయి వరకు దృష్టికి తీసుకపోయినప్పటికీ నిధులు కొరత చూపిస్తూ తక్కువ నిధులు కేటాయించారు. మారుమూల ప్రాంతమైన మంథని విస్తీరణంలో చాల పెద్దది. నియోజక వర్గం అభివృద్ధి చెందాలంటే పెద్ద ఎత్తున నిధులు కావాలని భావించిన ప్రజలు శ్రీపాద తనయుడు దుద్దిళ్ల పని తనమును చివరి 5 సంవత్సరాలు చూసారు. మరొకమారు దుద్దిళ్లకి అవకాశము ఇవ్వడానికి స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. మంథని నియోజకవర్గం మొత్తం దుద్దిళ్ల పేరు మారుమ్రోగుతుండగా, అధికార పార్టీ (టి.డి.పి) చంద్రబాబు బలమైన ప్రత్యర్థిని శ్రీధర్ బాబుకు పోటీగా నిలబెట్టాడు. అతనే రామగుండమును అభివృద్ధిబాటలో నిలిపిన సోమారపు సత్యనారాయణ. అధికార పార్టీ (టి.డి.పి) ముఖ్యమంత్రి చంద్రబాబు, సోమారపు సత్యనారాయణ పేరు మంథని అసెంబ్లీకి ప్రకటించగానే మంథని ప్రాంతంలో మరొకమారు చర్చకు తెరలేపారు. ప్రజల మధ్య యువ నాయకుడు దుద్దిళ్ల, రాజకీయ అనుభవజ్ఞుడు సోమారపు సత్యనారాయణ అనేక ప్రసంగాలు చేసారు. ఎలక్షన్స్ అధికార పార్టీ (టి.డి.పి), కాంగ్రెస్ నాయకులను చాల ఇబ్బందులకు గురిచేసినప్పటికీ, ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రజాధారణ పొందుతున్న దుద్దిళ్లను అణువణువునా ప్రతిఘటించారు. అయినప్పటికీ ప్రజలంతా దుద్దిళ్ళకు నీరాజనాలు పలికారు. పల్లె పల్లెనా శ్రీధర్ బాబు ప్రజల పక్షాన చేసిన పోరాటాలు గుర్తు చేస్తూ, జయహో దుద్దిళ్ల అంటూ 42,000 పై చిలుకు మెజార్టీతో శ్రీధర్ బాబును 2004 ఎలక్షన్స్ లో గెలిపించారు. అదే సమయంలో రాష్ట్రమంతటా టి.డి.పి పాలనకు విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. దీనితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోకాంగ్రెస్ పార్టీ “ప్రభుత్వం” ఏర్పాటు చేసి విజయ దుందుభి మ్రోగించింది. దుద్దిళ్లకు అప్పటి వై.ఎస్. ప్రభుత్వంలో వివిధ పాలక వర్గ కమిటీలలో మెంబర్, జిల్లా కమిటీలలో అధ్యక్షులు గా అవకాశమిచ్చారు. దుద్దిళ్ల పనితనం వై.ఎస్.ఆర్ కొనియాడుతూ అప్పటి ప్రభుత్వం లో “ప్రభుత్వ విప్” గా అవకాశం కల్పించారు. వచ్చిన పదవితో తృప్తి చెంది అటు పార్టీకి విధేయునిగా ఉంటూ, ప్రజల క్షేత్రంలో ప్రజల పక్షాన ఉంటూ అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నియోజక వర్గ అభివృద్ధిలో మరో ముందడుగు వేసి మంథని ప్రజల మన్ననలు పొందాడు.

మూడవ సారి (2009-2014):

అప్పటికే అధికార పార్టీగా ఉంటూ రాష్ట్రములో ప్రజల మన్ననలు పొందుతున్న కాంగ్రెస్ రోజులవి. వివిధ సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి రాష్ట్రాన్ని ప్రగతి పధంవైపు తీసుకవెళ్తున్న వై.ఎస్ ప్రభుత్వం, అప్పుడే పార్టీ స్థాపించిన సినీ నటుడు చిరంజీవి (ప్రజా రాజ్యం) నుండి, ప్రతిపక్షం (టి.డి.పి) నుండి కాంగ్రెస్ పార్టీ కి రాష్ట్ర మంతటా గట్టి పోటీ నెలకొంది. ఒకానొక తరుణంలో చిరంజీవి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడా అన్నట్లు ఎలక్షన్స్ తలపించాయి. అయినప్పటికీ ప్రజలు ఏ ఆకర్షణకు, ప్రలోభాలకు గురి కాకుండా కాంగ్రెస్ పార్టీ కి , పార్టీ చేసిన అభివృద్ధి పనులకు పట్టంకట్టారు. నియోజక వర్గంలో శ్రీధర్ బాబు చేసిన అభివృద్ధి పనులతో పాటు, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రజలు పెద్ద ఎత్తున అభివాదం తెలిపారు. క్షేత్ర స్థాయిలో దుద్దిళ్ల ప్రచారం మారు మ్రోగుతున్న తరుణంలో ప్రతి పక్షం నుండి మరొకమారు సోమారపు సత్యనారాయణకు అవకాశం ఇచ్చింది. అప్పుడే స్థాపించిన ప్రజారాజ్జం పార్టీ నుండి పుట్ట మధుకు అవకాశం ఇచ్చి ఏకంగా “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్”ను చిరంజీవి మంథని ఎలక్షన్స్ ప్రచారానికి పంపించాడు. తెలంగాణ రాష్ట్ర సమితి నుండి రౌతు కనకయ్య, ఇండిపెండెంట్ అభ్యర్థి రామ్ రెడ్డి వర్గం నుండి గట్టి పోటీ ఎదుర్కొన్నప్పటికీ ప్రజలు “దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు” మరొక మారు అవకాశం కల్పించాలని నిర్ణయించి ౧౩౦౦౦ పైచిలుకు ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ (శ్రీధర్ బాబు) ను మంథని ప్రాంతంనుండి గెలిపించారు. రాష్ట్రములో అధికారం హస్త గతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ , వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో మరొకమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. ఈ సారి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, దుద్దిళ్ల పని తనము దృష్టిలో ఉంచుకొని ఎంతో విలువైన “విద్య శాఖ మంత్రి” పదవిని కేటాయించారు. దుద్దిళ్ల ఈ పదవిలో కొంత కాలమే ఉన్నపటికీ పలువురి మన్ననలు పొందాడు. వై.ఎస్.ఆర్ అకాల మరణంతో ఆ తదుపరి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి గారి మంత్రి వార్గంలో వివిధ మంత్రి పదవులను అధిరోహించారు. మంత్రిగా ఉంటూ నియోజక వర్గానికి వందల కోట్ల నిధులు తెచ్చి దుద్దిళ్ల నియోజకవర్గంపై తనదైన ముద్ర వేసాడు. ప్రతిపక్షాలు సైతం మంథని అభివృద్ధి పై , నిధుల సేకరణ పై కొనియాడారు.

తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించినందుకు దుద్దిళ్ల శ్రీధర్ బాబును అప్పటి ముఖ్య మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి శాసన సభ వ్యవహారల మంత్రిత్వ శాఖ నుండి వాణిజ్జ పన్నుల శాఖకు మార్చటంతో, దుద్దిళ్ల అసంతృప్తితో మంత్రివర్గానికి రాజీనామా సమర్పించారు. తెలంగాణ నూతన రాష్ట్ర సాధనలో దుద్దిళ్ల నాటకీయ పరిణామాల మధ్య తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు, స్వరాష్ట్ర సాధన బిల్లు ప్రవేశ పెట్టె క్రమంలో చర్చను ప్రక్కదారి పట్టించేందుకు, తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు అప్పట్టి ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రి శ్రీధర్ బాబును శాఖ మార్చడంతో, దుద్దిళ్ల తెలంగాణ కీలక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు. తెలంగాణ సాధించే క్రమంలో నా మంత్రి పదవి వదులుకోవడం చాల చిన్న విషయమని చెప్తూ ఆరోజు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గం నుండి తప్పుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సహచర సభ్యులతో కలసి అధిష్టానంతో పలు మార్లు చర్చ జరిపి తెలంగాణ నూతన రాష్ట్ర ప్రకియలో క్రియాశీలకంగా పనిచేసి నూతన రాష్ట్రము ఏర్పాటు చేపించారు.

నాల్గవ సారి (2014 – 2019):

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ అనంతరం ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలలో పోటీ చేసే అన్ని పార్టీలకు, నూతన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి వచ్చే ప్రభుత్వం కీలక నిర్ణయాలు, పథకాలు ప్రవేశపెట్టాలని; అప్పుడే తెలంగాణ నూతన రాష్ట్రము అభివృద్ధి పథంలో నడుస్తుందని మేధావి వర్గం, ప్రజలు సూచనలు చేసారు. అన్ని పార్టీలు ఎన్నికల మానిఫెస్టోలు తయారు చేయడంలో సిద్ధమవుతుండగా కాంగ్రెస్ పార్టీ తరపున అధిష్టానం దుద్దిళ్లకు అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునేవిధంగా, శ్రీధర్ బాబును “మానిఫెస్టో కమిటీ చైర్మెన్”ను చేసి కీలక బాధ్యతలు అప్పగించింది. ఆ తరుణంలో ఎన్నికలవేల టి.ఆర్.ఎస్ పార్టీ అనేక హామీలతో ప్రజలను అన్ని విధాలుగా మభ్య పెట్టి అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఇచ్చిన అధికారంలోకి రాలేదని అధిష్టానం పలుమార్లు విచారం వ్యక్తం చేసి, పార్టీని ప్రక్షాళన చేస్తూ తెలంగాణ కోసం నూతన కమిటీ ఏర్పాటు చేసి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉప అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. పార్టీ ప్రతి పక్షంలో ఉన్న కానీ దుద్దిళ్ల ప్రజల మధ్య అను నిత్యం తిరుగుతూ రాష్ట్ర వ్యాప్తంగా తనదైన ముద్ర వేసుకున్నాడు. అధికార పార్టీ సహితం తాము చేపించిన పలు సర్వేలలో దుద్దిళ్ల ప్రజాధారణ ఉన్న వ్యక్తిగా ప్రకటించారు.