Latest
Home » About Sridhar Babu » Personal life and interests

Personal life and interests

“లా” చదివిన శ్రీధర్ బాబు శైలజ రమయిర్ (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్) ను వివాహం చేసుకున్నారు. ఒక విధంగా ఈ వివాహం ప్రేమ మరియు పెద్దలు నిచ్ఛయించిందిగా పలు సందర్భాల్లో దుద్దిళ్ల తెలిపాడు. నిజాం కాలేజ్ లో దుద్దిళ్ల పొలిటికల్ సైన్స్ చదువుతుండగా శైలజ రమయిర్ తన జూనియర్ గా, ఆ తదుపరి దుద్దిళ్ల ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతుండగా తన జూనియర్ గా ఉన్న తరుణంలో పరిచయం కాస్త ఇష్టంగా మారింది. కుటుంబ సభ్యులందరికి శైలజ రమయిర్ కుటుంబం సాంప్రదాయం, సంస్కృతీ నచ్చడంతో పెద్దలంతా కలిసి ముహూర్తం నిర్ణయించి వివాహం జరిపారు. అందుకే వీళ్లది ప్రేమ వివాహం మాత్రం కాదని “లవ్ అండ్ ఆరెంజ్ మ్యారేజ్” అని దుద్దిళ్ల పలు మార్లు చెప్పాడు. దుద్దిళ్ళకు ఇద్దరు పిల్లలు ఉండగా ఒకరు అమ్మాయి, ఇంకొకరు అబ్బాయి. శైలజ రమయిర్ గారు చదువులోనే కాక సంస్కృతీ సాంప్రదాయ కూచిపూడి నృత్యంలో దిట్ట అని చెప్తారు.

దుద్దిళ్ల ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ తరుపున పని చేస్తుండగా, శైలజ రమయిర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఐ.ఏ.స్ అధికారిగా పలు శాఖలకు సేవలందిస్తున్నారు. దుద్దిళ్లకు మంథని వంటకాలేంటే చాల ఇష్టం. అను నిత్యం ప్రజలకు ఎదో చేయాలని తపన. రోజుకు 18 గంటలకు పైగా కస్టపడి పనిచేసిన మంత్రిగా పలుసందర్భలో అనేక వేదికల పైన మెచ్చుకున్నారు. దుద్దిళ్ళకు డ్రై ఫ్రూట్స్ అంటే మక్కువెక్కువ. గ్రామాలలో తిరగడం, నాన గారితో పనిచేసిన వాళ్లతో మాట్లాడటం అంటే చాల ఇష్టం.