Latest
Home » About Sridhar Babu » Early political career

Early political career

స్వర్గీయ శ్రీ శ్రీపాద రావు కరీంనగర్ జిల్లా లోని మంథని నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎం.ఎల్.ఎ గా గెలుపొంది, 1989-1994 వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాసనసభ స్పీకర్ గా పనిచేశారు . 1994 ఎన్నికల ముందు నక్సల్స్, పోలీసుల మధ్య జరిగిన ప్రత్యక్ష పోరు తీవ్రంగా ప్రభావం చూపింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో శ్రీపాదరావు పరాజయం పాలయ్యాడు. అయిన ఓటమి పాలయిన ప్రజలకు మాత్రం దూరం కాలేదు. ఆనాడు కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మరియు మరికొంతమంది సీనియర్ నాయకులు, మంథని ప్రాంత ప్రజా ప్రతినిధులు దుద్దిళ్ల శ్రీపాదరావు వారసునిగా మంథని ప్రాంత ప్రజలకు న్యాయకత్వం వహించి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని, శ్రీపాద కుటుంబ సభ్యులను ఒప్పించి శ్రీధర్ బాబును రాజకీయ క్షేత్రంలోకి ఆహ్వానించి, కాంగ్రెస్ పార్టీ మంథని నియోజక వర్గానికి ప్రాతినిధ్య బాధ్యతలను అప్పగించారు. అలా  దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించాడు.