Latest
Home » About Sridhar Babu » Early life and education

Early life and education

శ్రీధర్ బాబు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ మరియు ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు స్వర్గీయ శ్రీ డి.శ్రీపాదరావు మరియు శ్రీమతి జయమ్మ గారి మూడవ కుమారుడుగా మే 30 1969 న జన్మించాడు. శ్రీపాద రావుగారికి తన నాలుగవ సంతానంగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంథని ప్రాంతంలో జన్మిచాడు. ఉన్న ఆరుగురిలో శ్రీధర్ బాబు మాత్రమే ఈ ప్రాంతంలో జన్మిచడం దుద్దిళ్ల అదృష్టంగా అనేక సందర్భాలలో ప్రస్తావించాడు. శ్రీధర్ బాబుకు ఇద్దరు అన్నయ్యలు , ఒక అక్క, ఒక తమ్ముడు, ఒక చెల్లెలు. శ్రీధర్ బాబు మినహా మిగితా వాళ్ళంతా అమెరికాలో ఉంటారు.

శ్రీధర్ బాబు విద్యాబ్యాసం మొత్తం హన్మకొండ-వరంగల్ ప్రాంతంలో జరిగింది. పాఠశాలలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణుడైన దుద్దిళ్ల ఉన్నత చదువులకై హైదరాబాద్ పయనమయ్యారు. 10వ తరగతి, ఇంటర్ మీడియట్, డిగ్రీ, పి.జి హైదరాబాద్ లో పూర్తి చేసాడు. ప్రతిష్టాత్మక ఢిల్లీ యూనివర్శిటీ నుంచి ‘లా పట్టా’ సాదించి 29 సంవత్సరాల వయస్సులోనే, ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ లో న్యాయ సాధన చేసాడు.