Latest
Home » Pradesh Congress » Pradesh Congress - Mutharam » తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనం

శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజల జీవితాలు బాగు పడాలంటే టీఆర్‌ఎస్‌ను బొంద పెట్టి కాంగ్రెస్‌ను గెలిపించాలని  శ్రీధర్ బాబు కోరారు. నియోజకవర్గానికి స్థానిక ఎమ్మెల్యే , టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందేమి లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనం వీస్తోందన్నారు.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందిన వెంటనే

ప్రతి మహిళా సంఘానికి ఒక లక్ష రూపాయల చొప్పున గ్రాంట్‌ను అందజేస్తామన్నారు.

బ్యాంకుల నుంచి రూ.10 లక్షల రుణం ఇప్పిస్తామన్నారు. ఈ రుణానికి వడ్డీ భారాన్ని నెల నెలా ప్రభుత్వమే భరిస్తుందన్నారు.

అభయహస్తం పథకాన్ని పునరుద్ధరిస్తాం. గతంలో కన్నా పెన్షన్ పెంచి ఇస్తాం.

మహిళల కుటుంబాలకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తాం.

దురదృష్టవశాత్తు ప్రమాదంలో చనిపోతే కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల అందేలా బీమా

6 గ్యాస్ సిలిండర్లను ఉచితం

రేషన్ షాపుల్లో 7 కిలోల సన్న బియ్యంతో పాటు 9 నిత్యావసర వస్తువులను అందజేస్తాం.

ఎస్సీలు, ఎస్టీలకు ఉచితంగా అందజేస్తాం.

ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ వాడకానికి ఎలాంటి ఛార్జీలు విధించబోమన్నారు.

వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత కార్మికుల పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.2,000కు, వికలాంగుల పెన్షన్ రూ.1,500 నుంచి రూ.3,000కు పెంచుతామన్నారు.

పెన్షన్ పొందేందుకు అర్హత వయస్సును వృద్ధులకు 65 నుంచి 58కి తగ్గిస్తామన్నారు. కుటుంబంలో పెన్షన్‌కు ఎంత మంది అర్హులుంటే అంత మందికి పెన్షన్ అందజేస్తామన్నారు.

ప్రభుత్వోద్యోగుల తల్లిదండ్రులకు పెన్షన్ ఇస్తామన్నారు. గతంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టుకొని బిల్లులు ఆగిపోయిన వారికి వాటిని క్లియర్ చేస్తామన్నారు. అదనంగా మరో గదిని నిర్మించుకోవడానికి రూ.2 లక్షలు అందజేస్తామన్నారు.

ఎవరైనా సరే తమ స్వంత స్థలాల్లో డబుల్ బెడ్ రూం నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు అందజేస్తామన్నారు.

నిరుద్యోగులకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి అందజేస్తామన్నారు.

Comments

comments