Latest
Home » news » సింగరేణి కార్మిక సంఘాలు ఉద్యమ బాట

సింగరేణి కార్మిక సంఘాలు ఉద్యమ బాట

సింగరేణి వారసత్వ ఉద్యోగాల కోసం విపక్ష కార్మిక సంఘాలు ఉద్యమ బాట పడుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. జాతీయ కార్మిక సంఘాలు ఇవాళ సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తరువాత తొలిసారి సమ్మె చేపట్టేందుకు జాతీయ కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. వారసత్వ ఉద్యోగాల సాధన సమ్మెతోనే సాధ్యమవుతుందని భావిస్తున్న కార్మిక సంఘాలు ఈరోజు హైదరాబాద్ సింగరేణి భవన్‌లో యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి.

Comments

comments