Latest
Home » Congress Party » సంగారెడ్డిలో కాంగ్రెస్‌ ప్రజా గర్జన సభ

సంగారెడ్డిలో కాంగ్రెస్‌ ప్రజా గర్జన సభ

జూన్‌ 1వ తేదీన  సంగారెడ్డిలో తెలంగాణ ప్రజా గర్జన పేరుతో కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు శ్రీధర్‌బాబు తెలిపారు. ఉద్యోగాలు రాని నిరుద్యోగులు, గిట్టుబాటు ధర దక్కక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కోసమే ప్రజా గర్జన సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజా గర్జన సభలో రాహుల్‌ గాంధీ పాల్గొంటారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతామని అన్నారు. కేసీఆర్‌ పాలన నియంతృత్వం ట్రేడ్‌మార్క్‌లా మారిందని ధ్వజమెత్తారు

2014 ఎన్నికల తర్వాత గద్దెనెక్కిన సర్కారులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయని శ్రీధర్‌బాబు మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదని మండిపడ్డారు. వీరి వల్ల కేంద్ర రాష్ట్ర లో ఒరిగింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పై ప్రజలు పై సమస్యలపై ఇప్పటి వరకు పోరాడుతూ వచ్చామని వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మూడేళ్ళ పరిపాలనాలో పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. అందుకే తీవ్ర నిరాశలో ఉన్న ప్రజలకు మద్దతుగా జూన్ 1న సంగారెడ్డి లో “తెలంగాణ ప్రజా గర్జన బహిరంగ సభ” నిర్వహిస్తున్నామని శ్రీధర్‌బాబు ప్రకటించారు.  సుమారు లక్షమంది పాల్గొనే ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెళ్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు తరలివస్తున్నారని తమ సభ విజయవంతం అవడంపై పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు.

టీఆర్ ఎస్ ముడేళ్ల పరిపాలనలో రాజకీయ లబ్ది తప్ప మరేమీ లేదని శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ ఎస్ వైఫల్యం అసమర్థత – నిర్లక్ష్యం కారణంగా భారతదేశంలో రైతు ఆత్మహత్యలపై రెండో స్థానములో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రావడంలో ముఖ్య పాత్ర పోషించింది విద్యార్థులు – యువత అయితే వారి పట్ల కేసీఆర్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఒక్క మహిళ కూడా మంత్రిగా లేకపోవడం చూస్తుంటే మహిళలంటే ఎంత గౌరవం ఉందో తెలుస్తుందని అన్నారు. తెలంగాణలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని శ్రీధర్‌బాబు మండిపడ్డారు. రైతులకు 123 జీవో ఉపయాగం లేదని దీనిపై కోర్టు కి వెళతామని తెలిపారు. సిగ్గు ఎగ్గూ లేకుండా వలసలు ప్రోత్సాహకాలు చేపట్టడం రాజకీయ దిగజారుడుతనమే కాకుండా రాజ్యాంగ ఉల్లంఘన కూడా అని శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు.

రైతు ఆత్మహత్యలకు గత ప్రభుత్వాలే కారణమని నిస్సిగ్గుగా ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారని, ఇటీవల జరిగిన రైతుల ఆత్మహత్యలు మీ పాలనలో కాదా ఆయన సూటిగా ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండోస్థానంలో ఉందని శ్రీధర్‌బాబు మండిపడ్డారు. భూ సేకరణ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామని తెలిపారు.

Comments

comments