Latest
Home » Congress Party » సీనియర్ న్యాయవాదులను కలిసిన శ్రీధర్‌బాబు

సీనియర్ న్యాయవాదులను కలిసిన శ్రీధర్‌బాబు

విజయదశమి సందర్భంగా గురువారం మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రముఖ సీనియర్ న్యాయవాదులైనా మంథనికి చెందిన సువర్ణ చంద్రశేఖర్, రఘోత్తంరెడ్డి, సూరయ్యపల్లికి చెందిన మాదాటి ప్రభాకర్‌రెడ్డితో పాటు మంథనిలోని ప్రముఖ వ్యాపారవేత్తలైన కొమురవెల్లి ధనుంజయ్, కొమురవెల్లి విజయ్‌కుమార్, సకిలం కృష్ణమూర్తి, సకిలం శ్రీనివాస్‌లను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనకు మద్దతు తెలుపాలని శ్రీధర్‌బాబు వారిని కోరగా, వారు సానుకూలంగా స్పందించారు.

Comments

comments