Latest
Home » Congress Party » రైతుల భూములు లాక్కొంటున్న సర్కార్..!

రైతుల భూములు లాక్కొంటున్న సర్కార్..!

ప్రాజెక్టుల క్రింద భూములు కొల్పొతున్న రైతుల వద్ద తెలంగాణ సర్కార్ దౌర్జన్యంగా భూములు లాక్కోంటున్నదని, ఇందుకు నిదర్శనమే 123 జీవోకు సవరణలు చేసి ఆ జీవోతోనే కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ క్రింద భూములు కొల్పొతున్న రైతులను సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడమేనని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. గురువారం కాటారంలో విలేఖరులతో మాట్లాడుతూ తాము ప్రాజెక్టులకు వ్యతిరేఖం కాదని, ప్రాజెక్టుల ముసుగులో రైతులను దోచుకుంటున్న దానికి వ్యతిరేఖమన్నారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా భూముల ధరల మార్కెట్ విలువలను సవరించి, 2013 చట్టం ఆమలు చేయాలని, అప్పుడే ప్రాజెక్టుల క్రింద భూములు కోల్పొతున్న రైతులకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.

ప్రత్తి పంట వద్దు.. అరుతడి పంటలు ముద్దు అని నినాదం చేసి, రైతులను మంత్రి హరీష్‌రావు, సిఎం కెసిఆర్‌లు నాట్టేటా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం, మంత్రి మాటాలను నమ్మి రైతులు తము పండించిన ప్రత్తిని రూ. 4 వేలకు క్వింటాల్‌కు అమ్ముకోవడం జరిగిందని, ప్రస్తుతం క్వింటాల్‌కు రూ. 5500లు పలుకుతుందన్నారు. పాలకుల మాటాలను విశ్వసించి ప్రత్తికి బదులు కంది పంటను సాగు చేసిన రైతులకు నేడు గిట్టుబాటు ధర లేక, కోనువారు దిక్కులేక కంది రైతులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. గతంలో మిర్చి క్వింటాల్‌కు రూ. 14 వేల ధర పలుకుగా, తెలంగాణ సర్కార్ అవలంభిస్తున్న తప్పుడు మార్కెటింగ్ విధానాలతో రూ. 5 వేల నుంచి రూ. 6 వేలకు పడిపోయి రైతులు పెట్టుబడి పెట్టిన పెట్టుబడి రాని దుస్ధితి నెలకోందన్నారు.

అటూ ప్రాజెక్టుల క్రింద భూములు కోల్పొతున్న రైతులకు న్యాయమైన నష్టపరిహరం ఇవ్వకుండా మోసం చేస్తూ, ఇటూ ఆరుగాలం కష్టించి పంటలు పండించిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా, రైతులను అప్పుల్లో కూరుకుపోయేలా చేస్తున్న టిఆర్‌ఎస్ సర్కార్ ముమ్మాటికి రైతు వ్యతిరేఖ ప్రభుత్వమనేనన్నారు. కంది, మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు 2013 భూసేకరణ చట్టం ద్వారా మాత్రమే భూసేకరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments

comments