Latest
Home » news » రైతుల్ని మోసం చేసేందుకు టీఆర్‌ఎస్‌ కుట్ర

రైతుల్ని మోసం చేసేందుకు టీఆర్‌ఎస్‌ కుట్ర

ఎకరాకు రూ.నాలుగు వేలు చెల్లించాలనే పథకం కేసీఆర్‌ రైతులను ఆకట్టుకునే ఎత్తుగడలో భాగమేనని, నాలుగు సంవత్సరాలు రైతులు పడిన కష్టాలు తాత్కాలికంగా మర్చిపోయేలా  కేసీఆర్‌ కొత్త పథకాన్ని తెరపైకి తేబోతున్నారని విమర్శించారు.

నాలుగు సంవత్సరాల కేసీఆర్‌ నిర్లక్ష్యపు పాలనలో నాలుగు వేల మంది తెలంగాణ రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పారు. చిన్నకారు, సన్నకారు రైతులను కేసీఆర్‌ సర్కార్‌ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. రైతుల సమన్వయ సమితుల పేరుతో మరోసారి రైతులను మోసం చేయడానికి కేసీఆర్‌ వ్యూహరచన చేశారని, ఆ సముతుల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ వారినే నియమించి ప్రజాధానాన్ని దుర్వినియోగం చేసేందుకు కేసీఆర్‌ సర్వశక్తులు ఒడ్డుతున్నారని  తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Comments

comments