Latest
Home » రాష్ట్రంలో ద‌ళితుల‌ను బ‌త‌క‌నివ్వ‌రా..!
sridhar babu
ప్రజాచైతన్య యాత్ర లో పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

రాష్ట్రంలో ద‌ళితుల‌ను బ‌త‌క‌నివ్వ‌రా..!

కేసీఆర్ పాల‌న‌లో ద‌ళితులు భ‌య‌ప‌డుతూ బ‌తుకుతున్నార‌ని పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ స‌ర్కార్ ద‌ళితుల ప‌ట్ల క‌నీస మాన‌వ‌త్వం లేకుండా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని అన్నారు. దేశంలో ఏరాష్ట్రంలో జ‌ర‌గ‌న‌న్ని దాడులు.. తెలంగాణ జ‌రుగుతున్నాయ‌ని ఇదేమ‌ని ప్ర‌శ్నించిన వారిపై ప్ర‌భుత్వం పోలీసుల‌తో అణిచివేస్తుంద‌ని ఆవేద‌న వ్య‌క్తంచేసిన ఉత్త‌మ్, దళితుల్ని అవమానిస్తూ., అణిచివేస్తున్న కేసీఆర్ ప్ర‌భుత్వానికి బుద్దిచెప్పాల‌ని పిలుపునిచ్చారు. తెలంగాణలో దళితులకు తీరిన అన్యాయం జరుగుతోందని, దళితులు పెదవి విప్పితే దాడులు చేస్తున్నారని, హక్కుల గురించి ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తున్నారని, దారుణంగా చిత్రవధలకు గురిచేస్తున్నారని నిప్పులు చెరిగారు ఉత్తమ్‌. రాష్ట్రంలో ద‌ళితుల అనిచివేత‌కు మంథనిలో దళిత యువకుడు మధుకర్‌ దారుణ హత్యేనే నిలువెత్తు నిదర్శనమన్నారు. రెండ‌వసారి మధుకర్‌ మృతదేహానికి పోస్టుమార్టం చేసి ఏడాది గ‌డుస్తున్నా.. ఎందుకు ఆ నివేదిక‌ను బ‌య‌ట‌పెట్ట‌డంలేద‌ని ప్ర‌శ్నించారు.

ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు సిరిసిల్ల‌లో దళితుల‌పై చిత్ర‌హింస‌లు., టిఆర్ఎస్ ఎమ్మెల్యే ర‌స‌మ‌యి వేదింపుల‌తో మాన‌కొండురూలో ఇద్ద‌రు ద‌ళితు యువ‌కుల ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించ‌డం, ఖ‌మ్మంలో ద‌లిత‌, గిరిజ‌న రైతుల‌కు బేడీలు వేయ‌డాన్ని ప్ర‌జ‌లు ఎన్న‌డికి మ‌ర్చిపోర‌ని ఆన్నారు. ఎస్సీ, ఎస్టీల అట్రాసిటీస్‌ (నివారణ) చ‌ట్టాన్ని సవరించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్ని వ్యతిరేకిస్తూ దళితులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్ర‌క‌టిస్తుంద‌ని తెలిపారు ఉత్త‌మ్. ఇప్పటికే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు రాహుల్‌ గాంధీ దళితుల ఉద్యమానికి బేషరతుగా మద్దతు ఇచ్చారని, కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ దళితులకు అండగా ఉంటుందని ఆయన ప్రకటించారు. చట్టాన్ని నీరుగార్చేందుకు మోడి స‌ర్కార్ ప్ర‌య‌త్నిస్తుంద‌ని దీన్ని గ‌ట్టిగా తిప్పికొట్టాల‌ని పిలుపునిచ్చారు.

శాసనసభ నుంచి రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట వ్యతిరేకంగా అకారణంగా దళిత శాసనసభ్యుడు ఎ.సంపత్‌కుమార్‌ను శాశ్వతంగా తొలగించారని ఉత్తమ్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ ఘటన తెలంగాణ చరిత్రలోనే మాయని మచ్చగా ఆయ‌న అభివర్ణించారు.టిఆర్ఎస్‌ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఉద్దేశించిన నిధులను ఖర్చు చేయకుండా ఎలా త‌ప్పుడు లెక్క‌లు చూపి మోసం చేసిందో కాగ్ బ‌ట్ట‌బ‌య‌లు చేసింద‌ని అన్నారు ఉత్తమ్‌. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌తోపాటు ఆ ప్రాజెక్టుకు అంబేద్కర్‌ పేరును ఎందుకు తొలగించారో కేసీఆర్‌ ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు.

Comments

comments