Latest
Home » news » దళితుల కుటుంబానికి మూడు ఎకరాల సాగు భూమి ఏది ?

దళితుల కుటుంబానికి మూడు ఎకరాల సాగు భూమి ఏది ?

నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ఎన్నో వైఫల్యాలు కనబడుతున్నాయని, ఎన్నికల ముందు హామీలతో ప్రజల మనసుల్ని కొల్లగొట్టిన కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లల్లో ప్రజలు గుండెలు బాదుకునేలా చేశారని శ్రీధర్ బాబు నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే తొలి సీఎం దళితుడేనని చెప్పిన కేసీఆర్‌.. హామీని తుంగలోకి తొక్కి ఆయనే సీఎం పదవిలో కూర్చున్నారని తప్పుపట్టారు. దళితుల కుటుంబానికి మూడు ఎకరాల సాగు భూమి ఇస్తామని చెప్పి అమలు చేయకుండా మోసం చేశారని శ్రీధర్ బాబు  విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు తీరని నిరాశలో ఉన్నారని, ఎన్నిక ముందు టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలేవీ అమలు చేయకపోవడంతో ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారని శ్రీధర్ బాబు చెప్పారు.

Comments

comments