Latest
Home » Youth Congress » Youth Congress - Manthani » ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధీ, తెలంగాణ ప్రజల, ఉద్యమకారుల సంక్షేమమైనా, మంథని నియోజకవర్గ అభివృద్ధి అయినా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ఇది వరకు తాము నిరూపించి చూపామన్నారు. కాంగ్రెస్ పార్టీపై, తమపై నమ్మకంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరిన, చేరుతున్న  మంథని నియోజకవర్గ టీఆర్‌ఎస్, ఇతర పార్టీల ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు స్వాగతం పలుకుతున్నామని, వారి రాకతో మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతవుతున్నదని శ్రీధర్‌బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. తాను గెలిచాక మంథని నియోజకవర్గంలోని పది మండలాల్లో మండలానికో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడుతామన్నారు.

ఎన్నికల సమయంలో కష్టపడి పని చేసిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు అండగా ఉండటమే గాక తాను గెలిచాక వారికి సముచిత స్థానం కల్పిస్తానని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హమీ ఇచ్చారు. అధికారంలో లేకున్నా, ఈ నాలున్నర సంవత్సరాలు తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని వీడకుండా ఉన్న వారిని ఎప్పుడు మరిచిపోనన్నారు. ఈ నాలున్నర యేళ్లు ఒక ఎత్తు.. ఈ 30 రోజులు మరో ఎత్తు అని, ఈ 30 రోజులు ఒక యజ్ఞంలా పనిచేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు శ్రీధర్‌బాబు పిలుపు నిచ్చారు.

Comments

comments