Latest
Home » NSUI » NSUI - Manthani » పెరుగుతున్న నిరుద్యోగ సమస్య

పెరుగుతున్న నిరుద్యోగ సమస్య

తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రత గట్టి హెచ్చరికలాంటిది. ఇది అత్యంత ఆందోళనకరమైనది. ఏడు వందల వీఆర్‌వో పోస్టులకు ఏకంగా 10 లక్షల 58 వేల మంది దరఖాస్తు చేసుకున్నారంటే నిరుద్యోగ సమస్య ఎంత ప్రమాదకర స్థాయికి చేరిందో అర్ధం అవుతోంది.

కనీస విద్యార్హత ఇంటర్మీడియట్‌ అయితే దరఖాస్తుదారుల్లో 372 పీహెచ్‌డీ చేసిన వారున్నారు. 539 మంది ఎంఫీల్, 1.5 లక్షల మంది పీజీ చేసిన వారు, నాలుగు లక్షల మంది గ్రాడ్యుయేట్లు (ఇందులో సగం మంది ఇంజినీరింగ్‌ చేసినవారు) చేసిన వారు దరఖాస్తు చేసుకున్నారు.

అదేవిధంగా 9,355 జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల కోసం ఏకంగా 5 లక్షల 69 వేల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి కూడా ఉన్నత చదువులు పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకున్నారంటే.. తెలంగాణాలో ఉన్నత చదువులు చదివిన వారికి ఉద్యోగ కల్పన శూన్యమని స్పష్టం అవుతోంది.

కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఏమాత్రం చర్యలు తీసుకోలేదని ఈ తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థల్లో సుమారు 2.5 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకి నాలుగున్నర సంవత్సరాల టీఆర్ఎస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. నిరుద్యోగులంతా కేసీఆర్‌ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరాన్ని ప్రభుత్వమే కల్పించింది.

Comments

comments