Latest
Home » Youth Congress » Youth Congress - Manthani » నిరుద్యోగుల్ని నిండా ముంచిన కేసీఆర్‌

నిరుద్యోగుల్ని నిండా ముంచిన కేసీఆర్‌

తెలంగాణ కల సాకారం అవ్వడానికి విద్యార్థులు, యువత చేసిన పోరాట ఫలితం, వారి త్యాగాలే కారణమని, తెలంగాణ వచ్చాక కేసీఆర్‌ పాలనలో వారంతా తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారని శ్రీధర్ బాబు  విమర్శించారు.

‘కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఒక సమగ్ర ప్రణాళిక ద్వారా లక్షలాది ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటుంది. ప్రతి సంవత్సరం లక్షల ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుడుతుంది. గత కాంగ్రెస్‌ పాలనలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (ఐటీఆర్‌) ప్రాజెక్ట్‌ను ప్రారంభించిందని, 50 లక్షల ఉద్యోగాలు భర్తీకి వీలయ్యేదని, అయితే టిఆర్ఎస్‌ ప్రభుత్వం ఆప్రాజెక్ట్‌ను నీరుగార్చేందని విమర్శించారు.

టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు తెలంగాణలో నిరుద్యోగ సమస్యను పతాక స్థాయికి తీసుకువచ్చి వదిలేశాయని, పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీల కారణంగా అనేక పరిశ్రమలు మూతపడ్డాయని, చిన్నతరహా వ్యాపారాలు దెబ్బతిన్నాయని, లక్షల మంది ఉద్యోగులకు నష్టం వచ్చిందని విమర్శించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కంటే బీజేపీ, మోదీలపై కేసీఆర్‌కు ప్రేమాభిమానలు ఎక్కువగా ఉన్నాయని, అందుకే బీజేపీ తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలన్నింటినీ టీఆర్ఎస్‌ సర్కార్‌ కళ్లు మూసుకుని మద్దతు ఇచ్చిందని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి నిప్పులు చెరిగారు.

మీకు ఉద్యోగం కావాలన్నా.. కనీసం నిరుద్యోగ భృతి రావాలన్నా కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలపండి

Comments

comments