Latest
Home » Youth Congress » గెలుపే లక్షంగా నేటి నుంచే సన్నద్ధం కావాలి

గెలుపే లక్షంగా నేటి నుంచే సన్నద్ధం కావాలి

2019 జరి గే ఎన్నికల్లో కార్యకర్తలు గెలుపే లక్షంగా నేటి నుంచే సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల అండదండలే పార్టీకి కొండంత బలమని అందు కు సమిష్టిగా ముందుకుసాగి పార్టీ పటిష్టతకు ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలన్నారు. విభేదాలు వీడి సమన్వయంతోనే అందరం ముందుకు సాగినప్పుడే తిరిగి పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. పట్టణ, గ్రామ, నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామ న్నారు. టీఆర్‌ఎస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ప్రభుత్వ వైఫల్యాలను కార్యకర్తలు ప్రజలకు వివరించాలని అన్నారు. గ్రామాల అభి వృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఆగమేఘాల మీద నిధులు కేటాయించి ఈ నెల చివరిలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీచేయడం ఎలా అభివృద్ధి జరుగుతుందని ప్రశ్నిం చారు. ఈ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలుకకపోతే నిధులు తిరిగి వెనుకకు వెళ్ళే అవకాశముందన్నారు. పొట్టదశలో ఉన్న పంటపొలాలకు నీరు నిలుపు దల చేస్తే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతారని, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నిరంతరాయంగా నీటి విడుదలను చేయాలన్నారు.

Comments

comments