Latest
Home » Congress Party » కేసీఆర్‌ చెప్పేవన్నీ మాయమాటలు

కేసీఆర్‌ చెప్పేవన్నీ మాయమాటలు

మాయ మాటలతో ప్రజలను మభ్యపెడుతూ… మోసం చేస్తూ సీఎం కేసీఆర్‌ ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ ఉపాధ్యకక్షుడు, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లబ్యారేజీ, కన్నెపల్లి, గోళవాడ, సిరిపురం, పంపు హౌస్‌ బాధిత రైతులకు 2013 కేంద్ర ప్రభుత్వ భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టు కింద వేలాది ఎకరాల భూములు ముంపుకు గురవుతాయని తెలిసినా.. ప్రాజెక్టు అసలు నివేదికలను బయటపెట్టకుండా సీఎం కేసీఆర్‌, టిఆర్‌ఎస్‌ పాలకులు, నాయకులు వంద, రెండు వందల ఎకరాలు మాత్రమే ముంపునకు గురవుతాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జీఓ 123 కాకుండా 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని, అప్పుడే రైతులకు న్యాయమైన నష్టపరిహారం అందుతుందన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతుల నుంచి బలవంతంగా సంతకాలు చేయించుకుంటున్నారని ఆరోపించారు.

Comments

comments