Latest
Home » Congress Party » కార్మికులను దగా చేసిన కేసీఆర్‌

కార్మికులను దగా చేసిన కేసీఆర్‌

ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీని కేసీఆర్‌ నిలబెట్టుకోవాలని హితవు పలికారు. కార్మిక సమస్యలపై గండ్ర ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు కమిటీ వేశారు. కుంతియా, ఉత్తమ్‌, షబ్బీర్‌, శ్రీధర్‌బాబు కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి కార్మికుల పరిధిలోని 24 నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తామని, కార్మికులకు కేసీఆర్‌ చేసిన దగాపై వివరిస్తామని వారు అన్నారు. సింగరేణిలో 25 వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారని, కాంట్రాక్టు కార్మికులే లేరని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ తప్పుదోవపట్టించాలనుకోవడం బాధాకరమని అన్నారు. ఉపాధి హామీ కూలీలనూ కేసీఆర్ మోసం చేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

comments