Latest
Home » Congress Party » కాంగ్రెస్ మేనిఫెస్టోను టీఆర్‌ఎస్ కాపీ కొట్టింది

కాంగ్రెస్ మేనిఫెస్టోను టీఆర్‌ఎస్ కాపీ కొట్టింది

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోకు ప్రజల్లో విశేష స్పందన వస్తుండటంతో, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్ నేతలకు భయం పట్టుకుందని, కాంగ్రెస్ మేనిఫెస్టోను యాథావిధిగా కాపీ కొట్టి, మా హామీలపై కానుకగా కేవలం రూ. 16 పెంచినట్లు టీఆర్‌ఎస్ మినీ మేనిఫెస్టో చూస్తే స్పష్టంగా కనబడుతున్నదని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు.

బుధవారం మంథనిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల ఫించన్లపై, నిరుద్యోగ భృతిపై తమకంటే రూ. 16 పెంచారే తప్పా టీఆర్‌ఎస్ మినీ మేనిపెస్టోలో ప్రత్యేకత ఏమీ లేదని, ఇదేనా జనంమెచ్చిన మేనిపెస్టో అని ప్రశ్నించారు. శ్రీ రైతుబంధు పథకాన్ని రూ. 8 వేల నుంచి రూ. 10 వేలకు పెంచారే తప్పా.. కౌలు రైతులను మరో మారు విస్మరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కౌలు రైతులను రైతులుగా గుర్తించి వారికి రైతుబంధు పథకం అందించి తీరుతామన్నారు.

డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాన్ని కొనసాగిస్తామని తెలిపారే తప్పా.. నాలుగున్నరేళ్లలో జిల్లాలో గానీ, మంథని నియోజకవర్గంలో ఏ ఒక్క డబుల్ బెడ్‌రూం ఇంటి గృహ ప్రవేశం జరిగిందా..? అని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. మండలానికో పదో, పరకో నిర్మిస్తూ, ఆ ఇండ్లను భూతద్దంలో చూపించి, ఎన్నికల్లో లబ్ధ్ది పొందాలని టీఆర్‌ఎస్ చూస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామంటే కట్టించి చూపించామన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేసి తీరుతుందని,.. చేసేది మాత్రమే చెబుతామన్నారు.

గతంలో రుణ మాఫీ చేయడంలో టీఆర్‌ఎస్ పార్టీ విఫలమైందని, రైతుల లక్ష రూపాయల రుణమాఫీ నాలుగు దఫాలుగా చేయడంలో రైతులపై వడ్డీ భారం పడడంతో రైతులు మోసపోయారని, మరో మారు లక్ష రుణ మాఫీ అన్నారే తప్పా, ఒకేసారీ చేస్తామని చెప్పలేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏక కాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి తీరుతామన్నారు.  2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు మరో మారు నమ్మే స్థితిలో లేరన్నారు

Comments

comments