Latest
Home » Youth Congress » Youth Congress - Kamanpur » కాంగ్రెస్ పార్టీ గెలుపు సందర్బంగా కమాన్ పూర్ లో స్వీట్లు పంపిణీ

కాంగ్రెస్ పార్టీ గెలుపు సందర్బంగా కమాన్ పూర్ లో స్వీట్లు పంపిణీ

ఈరోజు (20-03-2017) మంథని గ్రామపంచాయతిలో జరిగిన ఉప సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్తి పుప్పాల భాగ్యలక్శ్మి విజయం సాధించింది. .

మంథనిలో జరిగిన ఉప సర్పంచ్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు సందర్బంగా కమన్ పూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. అత్యధిక సభ్యులు కాంగ్రెస్ బాల పరచిన అభ్యర్థికి మద్దతు పలకడంతో భాగ్యలక్శ్మి విజయం సాధించింది. దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాలననే ప్రజలు కోరుకుంటున్నారని, అధికారా పార్టీ ఆగడాలకు ఈ గెలుపు ఒక నిదర్శనంగా పేర్కొన్నారు. మునుముందు వచ్చే ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ  విజయం తథ్యమని, ఇకనైనా ప్రజలకు ఎన్నికల హామీలు నెరవేర్చాలని, మాయమాటలు చెప్పి మరొకమారు మభ్యపెట్టవద్దని హితవు పలికారు.

ప్రముఖ  గ్రూప్ సభ్యులు స్వచ్చందంగా చేసిన ఆర్ధిక సహాయంతోనే మంథని సుందరంగా మారిందని, సర్పంచ్ కానీ ప్రభుత్వం కానీ  చేసిన నిర్వాకం ఏం లేదని, సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అంటూ విమర్శించారు. ఆ గ్రూప్ సభ్యులు మంథనిలో విరాళాలు సేకరించి మా గ్రామమును మేమె సుందరంగా తీర్చిదిద్దుకుంటామంటూ స్వచ్ఛందగా పనులు చేయడం వల్లే మంథని చెట్లతో, పూల కుండీలతో  అందంగా  కనిపిస్తుందని గ్రూప్ సభ్యులే బాహ్యటంగా చెప్తున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలిపారు.

Comments

comments