Latest
Home » news » కాంగ్రెస్‌ బస్సు యాత్రకు అశేష స్పందన

కాంగ్రెస్‌ బస్సు యాత్రకు అశేష స్పందన

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) ప్రారంభించిన ప్రజా చైతన్య బస్సు యాత్రకు అశేష స్పందన లభించింది. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున హాజరవ్వడంతో బస్సు యాత్ర ప్రారంభం నుంచి నేడు ముగిసే వరకూ కాంగ్రెస్‌ పార్టీ నేతలకు జన నీరాజనం లభించింది. బస్సు యాత్ర వేలాది మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు తీరని నిరాశలో ఉన్నారని, ఎన్నిక ముందు టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలేవీ అమలు చేయకపోవడంతో ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారని శ్రీధర్ బాబు చెప్పారు.

ఇచ్చిన హామీల్ని అమలు చేయని టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మహిళల్లో పెద్ద ఎత్తున మార్పులు వస్తాయని సోనియాగాంధీ ఆశించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే.. గత నాలుగేళ్ల కేసీఆర్‌ పాలనలో దారుణ వైఫల్యాలు మూటకట్టడంలో ముందున్నారని తీవ్రంగా శ్రీధర్ బాబు దుమ్మెత్తిపోశారు.

సోనియాగాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే గొప్పనాయకురాలని, తెలంగాణ ఇవ్వకుండా ఉండి ఉంటే సమైక్య రాష్ట్రంలో 25 లోక్‌సభ సీట్లు కాంగ్రెస్‌ పార్టీకి వస్తాయని ఇతరులు చెప్పినా ఆమె ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కీర్తి చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. తెలంగాణ వస్తే ఎందరికో మేలు జరుగుతుందనే కలల్ని టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే కల్లలు చేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వల్ల ఎంతో జరుగుతుందన్న ప్రజల ఆశల్ని ఆవిరి చేసేశారని శ్రీధర్ బాబు దుయ్యబట్టారు.

Comments

comments