Latest
Home » NSUI » NSUI - Kamanpur » ఓట్ల కోసమే ప్రకటనలు

ఓట్ల కోసమే ప్రకటనలు

ప్రభుత్వం ఆర్భాట ప్రకటనల తో ఆశలను కలిపిస్తోందని, గొర్రెల పంపిణీ, మత్సకారుల జీవనోపాధి అమలు విషయం లో ప్రభుత్వ చర్యలు అనుమానంగానే ఉన్నాయన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో రైతాంగం ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలకు కనీస పరి ష్కారం చూపలేదని, ధరల పెరుగుదలకు అనుగుణంగా ప్రతిపాదనలను పెంచలేదని, మార్కెట్ స్థిరీకరణ నిధి కూడా లేదని విమర్శించారు.లక్షలాది గొర్రెల పంపిణీ నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ, వెటర్నరీ సేవ లను విస్తృతపర్చే అంశం బడ్జెట్ ప్రస్తావనలో లేదన్నారు.ప్రాజెక్టుల పేరుతో రైతుల నుంచి భూమి స్వాధీనం చేసుకోవడంలో ప్రభుత్వం అడ్డుగోలుగా నిరంకుశ వైఖరిని ప్రదర్శించిందని, జివోల ద్వారా భూసేక రణను న్యాయస్థానం వ్యతిరేకించడంతో ప్రభుత్వం సవరించిన కొత్త చట్టాని కి కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందక ఆగిపోయిందన్నారు.
బడ్జెట్‌లో దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ కార్యక్రమానికి నిధులను కేటాయించలేదని, వ్యవసా య రం గానికి 2016-17లో రూ. 3477 కోట్లు కేటాయించగా, కొత్తగా ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో రూ 3547 కోట్లు మాత్రమే ప్రతిపాదించారని అన్నారు. రైతుల ఆత్మహత్యలలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో ఉన్న దని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకు న్నారని చెప్పారు. సంక్షోభంలో ఉన్న రైతాంగానికి ప్రభుత్వం నుంచి భరోసా దొరకకపోడంతో వారు తీవ్ర నిరాశ నిస్పృహాలకు గురవుతున్నారని అన్నా రు.

Comments

comments