Latest
Home » Mahila Congress » Mahila Congress Manthani » ఉప ఎన్నికలలో మంథని ఉప సర్పంచ్ పీఠం కాంగ్రెస్ కైవసం

ఉప ఎన్నికలలో మంథని ఉప సర్పంచ్ పీఠం కాంగ్రెస్ కైవసం

మంథని గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన ఉప ఎన్నికలలో మంథని మేజర్ గ్రామ పంచాయతీ “ఉప సర్పంచ్” గా   కాంగ్రెస్ పార్టీ కి చెందిన పుప్పాల భాగ్య లక్ష్మి ఎన్నుకోబడ్డారు. శ్రీధర్ బాబు బలపరచిన అభ్యర్థిగా బరిలో దిగిన భాగ్య లక్ష్మికి మెజార్టీ సభ్యులు ఆమోదం తెలుపగా అధికారపార్టీ వాళ్ళు చివరి నిమిషం వరకు అనేక ప్రలోభాలకు గురిచేసినప్పటికీ దైర్యంగా సభ్యులంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు పలికారు. ప్రజలంతా ఈ గెలుపు అధికార పార్టీ  టి.ఆర్.ఎస్ కు చక్కటి గుణపాఠం అని చర్చిస్తున్నారు. ఇది ఇలా ఉండగా మెజార్టీ గ్రామ ప్రజలంతా సంతోషంతో పండగ చేసుకుంటున్నారని, ఉగాది ఈరోజే వచ్చినట్టుందని మండల అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్ మీడియా ద్వారా అభివాదం చేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపాడు.

Comments

comments