Latest
Home » Congress Party » ఉద్యోగులకు కొత్త పీఆర్సీ.. మధ్యంతర భృతి..

ఉద్యోగులకు కొత్త పీఆర్సీ.. మధ్యంతర భృతి..

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందిన వెంటనే ఉద్యోగులందరికీ మధ్యంతర భృతి (ఐఆర్‌) చెల్లిస్తామని, కొత్త వేతన సవరణ సంఘాన్ని (పీఆర్సీ) ఏర్పాటు చేస్తామని శ్రీధర్ బాబు ప్రకటించారు.

కొత్త పీఆర్సీ ఏర్పాటు చేయకుండా టీఆర్ఎస్‌ సర్కార్‌ కావాలని ఆపేసిందని ఆయన ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపొంతుందని, అధికారంలోకి రాగానే ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల్ని వెంటనే పరిష్కరిస్తామని, కొత్త పీఆర్సీ ఏర్పాటుతోపాటు మధ్యంతర భృతి కూడా చెల్లిస్తామని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత నాలుగున్నర సంవత్సరాల పాలనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని శ్రీధర్ బాబు ఆరోపించారు. వారి సమస్యల సాధన కోసంగానీ, డిమాండ్ల పరిష్కారం కోసంగానీ కేసీఆర్‌ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నమూ చేయలేదని విమర్శించారు.

Comments

comments