Latest
Home » Mahila Congress » Mahila Congress Mahadevpur » ఇసుక మాఫియాను ప్రొత్సహించడమే టీఆర్‌ఎస్ అభివృద్ది

ఇసుక మాఫియాను ప్రొత్సహించడమే టీఆర్‌ఎస్ అభివృద్ది

నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది ఏమైనా ఉంది అంటే అది ఇసుక మాఫియాను ప్రొత్సహించడమే తప్పా.. మరొకటి లేదని, ఇసుక లారీలతో మంథని  పెద్దపల్లి ప్రధాన రహదారితో పాటు మంథని టూ కాటారం, మహాదేవ్‌పూర్ భూపాలపల్లి ప్రధాన రహదారులు అన్ని పెద్ద పెద్ద గుంతలుగా మారి, అధ్వాన్నంగా మారాయని, ఇసుక లారీలతో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని,  ఎక్కడ బొంద ఉంటుందో, ఎక్కడ ఇసుక లారీ వచ్చి ఢీకొంటుదోనని ప్రయాణీకులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేయాల్సిన దుస్థితి నెలకొందని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

ఈ ఇసుక తవ్వకాలతో వచ్చి సీనరేజ్ నిధులను మంథని నియోజకవర్గానికి మాత్రమే పూర్తి స్థాయిలో కేటాయించాల్సి ఉండగా, ఏ ప్రామాణీకాల మీద హుజూరాబాద్ నియోజకవర్గానికి గానీ, కరీంనగర్ నియోజకవర్గానికి గానీ కేటాయించారో ప్రభుత్వం గానీ, కలెక్టర్ గానీ, అధికారులు గానీ ఇక్కడి మంథని ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాలని శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు.

Comments

comments