Latest
Home » Pradesh Congress » Pradesh Congress - Kataram » ఆదాయం లేకున్నా అంకెలు పెంచారు

ఆదాయం లేకున్నా అంకెలు పెంచారు

రాష్ట్ర బడ్జెట్లో అంకెలు వాస్తవికంగా లేవని శ్రీధర్ బాబు అన్నారు. 2016-17 బడ్జెట్‌లో రాబడులు రూ.25 వేల కోట్లు తగ్గినా నూతన బడ్జెట్‌ను 30 శాతం పెంచి 1.49 లక్షల కోట్లుగా ప్రతిపాదించారని ప్రస్తావించారు. ఏ రకంగా చూసినా బడ్జెట్‌ రూ.1.32 లక్షల కోట్లు దాటకూడదన్నారు. 2014-15 బడ్జెట్‌ అవాస్తవికంగా ఉందని స్వయంగా కాగ్‌ పేర్కొందని గుర్తు చేశారు.

ఒక వైపు పాత బడ్జెట్ల ఆదాయం అంచనాలు తగ్గించుకుంటూ, బడ్జెట్‌ ప్రతిపాదనలను సవరించుకుంటూ… మరోవైపు ఇంత పెద్ద మొత్తంలో కొత్త బడ్జెట్‌ ఎలా ప్రతిపాదిస్తారని నిలదీశారు. ఆరు కోట్ల జనాభా, పెద్ద ఎత్తున పరిశ్రమలతో భారీగా పన్నులు వసూలయ్యే గుజరాతలోనే రూ.1.71 లక్షల కోట్ల బడ్జెట్‌ పెట్టి, చివరకు 1.46 లక్షల కోట్లకు కుదించుకున్నారని ప్రస్తావించారు. అప్పులతో నెట్టుకొద్దామనుకుంటే మనకున్న ఆస్తులను బేరీజు వేసుకోవాలని సూచించారు. ‘‘బడ్జెట్‌ ప్రతిపాదనలు వాస్తవికంగా లేవు. కేటాయింపుల్లో కోత తప్పదు. ఏ పథకాలు ఆగిపోతాయో తెలీదు. ప్రజలను భ్రమల్లో పెడితే ఆశలు పెట్టుకున్న ప్రజలు ఇబ్బందుల పాలవుతారు’’ అని హెచ్చరించారు.

తెలంగాణ ధనిక రాష్ట్రమని అవాస్తవిక లెక్కలు చూపించడం వల్ల రాష్ర్టానికి తీరని నష్టం జరుగుతుందన్నారు. అప్పులు తెచ్చుకోవడం కోసం ధనిక రాష్ట్రంగా చూపడం సరైన పద్ధతి కాదని చెప్పారు. దానివల్ల భవిష్యత్తులో 15వ ఆర్థిక సంఘం నిధులు తగ్గే ప్రమాదం ఉందన్నారు. మిగులు రాష్ర్టాలకు కేంద్రం నిధులు తక్కువగా వస్తాయని, ఇతర సాయాల్లో కూడా కోత పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Comments

comments