Latest
Home » news » అర్హులందరికీ పెన్షన్‌ ఇవ్వాలి

అర్హులందరికీ పెన్షన్‌ ఇవ్వాలి

కేసీఆర్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయడమే తమ బస్సు యాత్ర ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. కేసీఆర్‌ రాజకీయ ఎత్తుగడలే లక్ష్యంగా ప్రజల్ని మోసం చేయడంలో ఆరితేరారని, అయితే టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు మరోసారి మోసపోయేందుకు సిద్ధంగా లేరని చెప్పారు. వాగ్ధానాల్ని అమలు చేయడంలో ఘోరవైఫల్యం చెందిన టీఆర్‌ఎస్‌కు ప్రజలంతా గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని శ్రీధర్ బాబు హెచ్చరించారు.

పెన్షన్‌ విధానంలో కేసీఆర్‌ సర్కార్‌ తీసుకున్న విధాన నిర్ణయం వయోవృద్ధులకు పెను సమస్యగా మారిందని శ్రీధర్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పెన్షన్‌ ఇవ్వడం సరైన విధానం కాదన్నారు. అర్హులందరికీ పెన్షన్‌ ఇవ్వాలని, షరతులతో కూడిన పెన్షన్‌ ఇచ్చి కష్టాలు లేకుండా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Comments

comments