Latest
Home » Mahila Congress » Mahila Congress Maha Mutharam » అధికారంలోకి రాగానే ఒకే ఇంట్లో రెండు పింఛన్లు

అధికారంలోకి రాగానే ఒకే ఇంట్లో రెండు పింఛన్లు

టీఆర్‌ఎస్ సర్కారు ఇంట్లో అర్హులైన వారు ఇద్దరు ఉన్నా ఒక్కరికి మాత్రమే పింఛను మంజూరు చేయడం జరిగిందని, రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇక ఇంట్లో అర్హులైన వారు ఇద్దరు ఉన్నా, ఇద్దరికీ పింఛన్లు మంజూరు చేసి, వారికి అండగా ఉంటామని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

మహముత్తారం మండలంలోని బర్లపల్లి, లింగాపూర్, కొర్లకుంట, పర్లపల్లి, లింగాపూర్, జిలపల్లి, వజీనపల్లి, ఖమ్మంపల్లి, మహబూబ్‌పల్లి, మహముత్తారం, మాదారం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన శ్రీధర్‌బాబుకు ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు డప్పు చప్పుళ్ల మధ్య ఘన స్వాగతం పలికారు. ఇప్పటి వరకు 65 సంవత్సరాలు నిండితేనే ఫించనుకు అర్హత ఉండగా, కాంగ్రెస్ రాగానే 58 సంవత్సరాలకు కుదిస్తామన్నారు.

వృద్ధాప్య, వితంతు పింఛను నెలకు రూ. 2 వేలు, వికలాంగులకు రూ. 3 వేలకు పెంచడంతో పాటు, ఇందిరమ్మ పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని, ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు, ముక్కిపోయిన దొడ్డు బియ్యంకు బదులు రూపాయికే కిలో సన్న బియ్యం, రేషన్ షాపుల ద్వారా తొమ్మిది సరుకులు అందించే అమ్మహస్తం పునరుద్దరణ, జ్వరం వచ్చినా పేదొడికి కార్పోరేట్ ఆసుపత్రుల్లో సైతం ఉచితంగా వైద్య సేవలు, అంతేకాక రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం క్రింద వైద్య ఖర్చును రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు పెంచడం జరుగుతుందన్నారు. ఇలా ఎన్నో పేద ప్రజల అండగా ఉండే పథకాలను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆమలు చేసి తీరుతామన్నారు.

Comments

comments